Begin typing your search above and press return to search.

దివాళీ ధమాకా.. తగ్గనున్న పెట్రోల్ ధరలు!

By:  Tupaki Desk   |   20 Sep 2017 1:30 AM GMT
దివాళీ ధమాకా.. తగ్గనున్న పెట్రోల్ ధరలు!
X
ఈ దీపావ‌ళి మ‌నంద‌రికీ తీపిక‌బురు అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అంద‌రికా..అంటే అవును అంద‌రికీ. ఎందుకంటే...పెట్రోలు ధరలపై ఇవాళ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాత్రం ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఓవైపు జీఎస్టీ ప‌రిధిలోకి దివాళీ లోపు పెట్రోల్ ధరలు తగ్గుతాయని ధర్మేంద్ర తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇంధనశాఖ ఆర్థిక శాఖను కోరిన నేపథ్యంలో సానుకూల వార్త వినవ‌చ్చ‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ స‌మ‌యంలోనే కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

రోజువారీగా పెట్రోల్ ధరలు మారే పద్ధతిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విధానం తర్వాత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి విస్తరణలో ధ‌ర్మేంద్ర‌ ప్రదాన్‌కు క్యాబినెట్‌లో కీల‌క‌మైన పెట్రోలియం శాఖ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అయి ఉండ‌వ‌చ్చు లేదా కాక‌తాళీయం కావ‌చ్చు ఇవాళ అమృత్‌సర్‌లో ధ‌ర్మేంద్ర ప్రధాన్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇంధన ధరలు దీపావళిలోగా తగ్గుతాయని ఓ సంకేతాన్ని ఇచ్చారు. అమెరికాలో వరదలు వచ్చిన కారణంగా ఇంధన ఉత్పత్తి 13 శాతం పడిపోయిందని, దాని వల్ల ఆయిల్ ధరలు ఆకాశానంటాయని మంత్రి తెలిపారు. త్వ‌ర‌లో ఈ ధ‌ర‌ల విష‌యంలో తీపిక‌బురు వింటార‌ని తెలిపారు. ఆయిల్ కంపెనీలకు మార్జిన్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. పెట్రోల్‌ను కూడా జీఎస్టీలోకి తీసుకువస్తే బాగుంటుందని, దాని వల్ల కస్టమర్లకు చాలా లాభం ఉంటుందని తెలిపారు. సాక్షాత్తు మంత్రే జీఎస్టీ అంశం ప్ర‌స్తావించ‌డంతో త‌గ్గింపు ఖాయ‌మని అంటున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబ్‌ 28 శాతం. ఈ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ చేరినా.. ధరలు మాత్రం భారీగా తగ్గుతాయి. అంటే లీటర్ పెట్రోల్‌ ధర 40 లోపుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెట్రోలు ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే... 2012లో మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70 ఉండేది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ (సుమారుగా 3789 లీటర్లు) పెట్రోల్‌ ధర 120 డాలర్లు (అంటే ఇప్పటి మారకం రేటు ప్రకారం రూ. 7620 మాత్రమే). అందులో కేంద్రం విధించే ఎక్సైజ్‌ డ్యూటీ రూ.21.48, రాష్ట్రాలు విధించే పన్ను రూ.27, అందులో వ్యాట్ రూ. 14.96 కాగా, డీలర్‌ కమీషన్‌ రూ.3.24, వాస్తవంగా పెట్రోల్‌ ధర వచ్చి 30.70 రూపాయలు.. అన్ని రకాల పన్నులతో కలిపి లీటర్‌ పెట్రోల్‌ రూ.70.38కి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధర బ్యారెల్‌కు 50 డాలర్లకు చేరినా కూడా ఢిల్లీలో రూ. 70 కే విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లాంటి కొన్ని నగరాల్లో ఇది రూ. 74కు చేరింది. మనదేశంలో గిరాకీ ఉన్న పెట్రోల్‌ ఉత్పత్తుల్లో దాదాపు 80 శాతం దిగుమతులు చేసుకున్నదే. ఈ వాస్తవం ఆధారం చేసుకుని ఇదివరలో ధరలు పెంచినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్ల పెరుగుదల కారణమని సాకు చెప్పేదు. కాని ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గిపోయినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం లేదు.