Begin typing your search above and press return to search.

కేంద్రానిది తప్పుడు వాదనేనా ?

By:  Tupaki Desk   |   28 March 2022 1:30 AM GMT
కేంద్రానిది తప్పుడు వాదనేనా ?
X
ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్లే దేశంలో పెట్రోలు, డీజల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాల్సొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు. ఐదురోజుల్లో నాలుగుసార్లు పెట్రోలు, డీజల్ ధరలు పెరిగాయి. దీనిపై దేశమంతా మండిపోతోంది. ఉక్రెయిన్-రష్యా కారణంగానే కేంద్రం పెట్రోలో, డీజల్, గ్యాస్ ధరలను పెంచాల్సొచ్చిందని చెప్పి చేతులు దులిపేసుకుంటోంది.

నిజానికి రష్యా నుండి మనకు దిగుమతయ్యే చమురు కేవలం 1 శాతం మాత్రమే. మనకు దిగుమతయ్యే చమురులో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుండే వస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవటంతో మనదేశంలో కూడా పెంచాల్సొచ్చిందట. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే యుద్ధం మొదలై నెల రోజులు మాత్రమే అయ్యింది. కానీ నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన దగ్గర నుండి చమురు ధరలను పెంచుతునే ఉంది.

యుద్ధానికి ముందు కూడా చమురు ధరలను మోడీ ప్రభుత్వం ఎందుకని పెంచినట్లు ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బాగా తక్కువన్న రోజుల్లో మనదేశంలో ధరలను తగ్గించాలి కదా. మరి సహజ సూత్రానికి భిన్నంగా క్రూడాయిల్ ధరలు తగ్గినపుడు ధరలు తగ్గించకుండా క్రూడాయిల్ ధరలు పెరిగినపుడు మాత్రం చమురు ధరలను పెంచేయటం ఏమిటనేది సామాన్యుడి ప్రశ్న.

ఇక్కడ విషయం ఏమిటంటే అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలతో సంబంధం లేకుండా జనాలు బాదటమే టార్గెట్ గా పెట్టుకున్నది మోడీ ప్రభుత్వం. తన టార్గెట్ కు అనుగుణంగానే చమురు ధరలను మోడి ప్రభుత్వం పెంచుకుంటుపోతోంది. జనాలు గట్టిగా అడిగితే ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అబద్ధాలు చెబుతోంది.

మరి కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రి ఎందుకున్నారంటే మాత్రం సమాధానం చెప్పటం లేదు. ఏ కంపెనీ అయినా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగమనే విషయం మామూలు జనాలకు బాగా తెలుసు. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి మోడీ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లుబాటైపోతోంది.