Begin typing your search above and press return to search.
ఇదే జోరు సాగితే లీటరు పెట్రోల్ రూ.150.. ఎప్పుడంటే?
By: Tupaki Desk | 18 Feb 2021 9:30 AM GMTకలలో కూడా ఊహించనంత వేగంగా పెట్రోల్.. డీజిల్ ధరలు మారిపోతున్నాయి. గతంలో లీటరుకు మూడు.. నాలుగు రూపాయిలు పెరగాలంటే.. దాదాపు ఆరేడు నెలలు పట్టేది. ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. ముందుకే తప్పించి.. వెనక్కి చూసేదే లేదన్న చందంగా పెట్రోల్.. డీజిల్ ధరలు వరుస పెట్టి పెరిగిపోతున్నాయి. చూస్తుండగానే.. లీటరు పెట్రోల్ రూ.90 దాటటమే కాదు.. రాజస్తాన్ లో ఇప్పటికే సెంచరీ మార్కు కొట్టేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో రూ.95 దగ్గరకు వచ్చేసింది.
మహా అయితే.. మరో రెండు వారాల్లో దేశంలోని అన్ని చోట్ల లీటరు పెట్రోల్ రూ.100 అయ్యే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ధరల్ని నిలువరించటం చేతకాని సాధారణ జనం.. పాలకుల్ని తిట్టుకోవటం తప్పించి మరింకేమీ చేయలేకపోతున్నారు. చేతిలో ఉన్న సెల్ ఫోన్ లోని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ.. తమ కష్టాల్ని చెప్పుకుంటున్నారు.
తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు 32- 34 పైసల మధ్య పెరిగింది. ఇటీవల కాలంలో రోజుకు 20నుంచి ముప్పై పైసలు చొప్పున పెరగటం రివాజుగా మారింది. ఇదంతా చూస్తే.. రానున్న కొద్ది రోజుల్లో సెంచనీ మాత్రమే కాదు.. లీటరు రూ.150 వరకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
దేశంలో రాజధాని ఢిల్లీలో పెట్రోల్.. డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. అక్కడ లీటరు పెట్రోల్ రూ.89.88 ఉండగా.. డీజిల్ ధర రూ.80.27గా ఉంది. అదే సమయంలో వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.96.32గా ఉంటే.. డీజిల్ ధర రూ.87.32గా ఉంది. ఇప్పుడు పెరుగుతున్న జోరులోనే పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతూ పోతే.. రానున్న ఆర్నెల్ల కాలంలో లీటరు పెట్రోల్ రూ.150 కావటం ఖాయమంటున్నారు. బాదించుకోవటానికి సిద్ధంగా ఉన్నా లేకున్నా.. బాదుడు తప్పదన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు సాధారణ ప్రజలు. అచ్చేదిన్ కు అసలుసిసలు అర్థం ఇదేనా మోడీజీ?