Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం అన్ని లిమిట్స్ దాటేసిందంటూ సుప్రీంలో పిటిషన్

By:  Tupaki Desk   |   13 Oct 2020 4:45 AM GMT
ఏపీ ప్రభుత్వం అన్ని లిమిట్స్ దాటేసిందంటూ సుప్రీంలో పిటిషన్
X
సంచలనంగా మారిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లం ప్రెస్ మీట్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ కు అనుకూలంగా.. ప్రతికూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సుప్రీంకోర్టులో న్యాయవాది ఒకరు పిల్ దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రిగా తన పరిధులన్నింటిని ఆయన దాటేశారన్నారు. ఇంతకీ ఈ పిల్ దాఖలు చేసింది.. సుప్రీంకోర్టు న్యాయవాది సునీల్ కుమార్ సింగ్.

ఏపీ హైకోర్టు సిట్టింగ్ జడ్జికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు. దీనికి కారణం.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో.. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతామని.. న్యాయవ్యవస్థను గౌరవిస్తామని జగన్ చేసిన ప్రమాణాన్ని ఆయన తుంగలోకి తొక్కారని పేర్కొన్నారు.

అంతేకాదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 - 211లను ఉల్లంఘించినట్లుగా సదరు న్యాయవాది తన పిల్ లో పేర్కొన్నారు. జడ్జిలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ముఖ్యమంత్రి జగన్ కానీ.. ఆయన ప్రభుత్వంపైనా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడ్డారో తెలియజేయాలని.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకునేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సునీల్ కుమార్ సింత్ కోరటం గమనార్హం. ఈ పిల్ విచారణకు రాలేదు. మరి..దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి.