Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి ఆ కేసులో భారీ ఊరట

By:  Tupaki Desk   |   9 May 2019 9:14 AM GMT
రాహుల్ గాంధీకి ఆ కేసులో భారీ ఊరట
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారతీయుడు కాదని.. అతడికి బ్రిటన్ పౌరసత్వం ఉందని బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరికింది. రాహుల్ గాంధీ పౌరసత్వం వివాదంపై గొప్ప ఊరట లభించింది. రాహుల్ భారతీయుడు కాదంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఢిల్లీకి చెందిన జై భగవాన్ గోయల్, చందర్ ప్రకాష్ త్యాగి అనే ఇద్దరు యువకులు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని.. అందువల్ల దేశంలో ఎన్నికల్లో పోటీచేయకుండా బహిష్కరించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

సుప్రీం కోర్టు రాహుల్ వాదనలతోపాటు పిటీషన్ల వాదనలు విన్నాక ఈ పిటీషన్ ను కొట్టివేసింది. అలాగే రాహుల్ పౌరసత్వంపై లండన్ కు చెందిన బ్యాకోప్స్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపక సర్టిఫికెట్ ను, ఆ కంపెనీ దాఖలు చేసిన రిటర్నులతో రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని పిటీషన్ వాదనలు సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా 2015లో కూడా రాహుల్ గాంధీపై ఇదే తరహా పిటీషన్ దాఖలైంది. అప్పుడు కూడా సుప్రీం కోర్టు పిటీషన్ ను కొట్టివేయడం విశేషం..

గాంధీల కుటుంబం నుంచి వచ్చిన ఇందిరా - రాజీవ్.. ఇప్పుడు రాహుల్ వీరి చరిత్ర దేశానికి తెలుసు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం ఇదీ. అందుకే సుప్రీం కోర్టు కూడా రాహుల్ పౌరసత్వం వివాదంపై పిటీషన్ల వాదనలను నిర్విద్వంగా తోసిపుచ్చింది. .