Begin typing your search above and press return to search.

నీలం సాహ్నీపై పిటిషన్.. హైకోర్టు స్వీకరణ

By:  Tupaki Desk   |   22 May 2021 4:30 PM GMT
నీలం సాహ్నీపై పిటిషన్.. హైకోర్టు స్వీకరణ
X
పరిషత్ ఎన్నికల విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై ప్రస్తుత ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీపై హైకోర్టు ఇటీవలే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆక్షేపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించడం సంచలనమైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి నీలం సాహ్నీ నియామకం జరిగిందని ఆర్ మహేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ కేసులో ప్రతివాదిగా పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎస్ఈసీ నియామకం చేశారని పిటీషన్ వాదనను రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని తెలిపింది. తేల్చి చెప్పింది, తద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం సందిగ్ధంలో పడింది. ఆమె పోస్టు ఉంటుందా? ఉండదా అన్న మీమాంస వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నీ సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను విరుద్ధంగా ఆమెకు ఎన్నికల సంఘం పదవిని ఇచ్చారని పిటీషన్ పేర్కొన్నారు. ఆమె అనుకూలత.. నియామకం గురించి సందేహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది.

టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు కూడా కోర్టు వ్యాఖ్యల తరువాత నీలాంసాహ్నిని ఈ పదవిలో కొనసాగించడానికి అనుమతించవద్దని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కావడానికి ముందు నీలం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ సలహాదారుగా పనిచేశారు.