Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటీషన్

By:  Tupaki Desk   |   6 Aug 2019 11:22 AM GMT
ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటీషన్
X
కశ్మీర్ లొల్లి న్యాయసమీక్షకు చేరింది. తాజాగా సుప్రీం కోర్టులో ఆర్టికల్ 70రద్దు, జమ్మూకశ్మీర్ విభజనలో నిబంధనలు పాటించలేదని.. ఆ బిల్లు చెల్లదని సుప్రీం కోర్టు తలుపుతట్టారు. దీంతో సుప్రీం కోర్టు ఏం తీర్పు చెబుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

కశ్మీర్ బిల్లు లోక్ సభలో చర్చ జరుగుతుండగానే కొందరు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. కేంద్రం కశ్మీర్ కు కల్పించిన ఆర్టికల్ 370 రద్దును చాలెంజ్ చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది.

కశ్మీర్ బిల్లు సందర్భంగా కేంద్రం విస్మరించిన అంశాల ప్రతిపాదికన న్యాయవాది ఎంఎల్ శర్మ మంగళవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని సమావేశపరిచి అభిప్రాయం తీసుకోకుండా.. కేంద్రం, రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడం తప్పు అని.. ఈ బిల్లు రద్దు చేయాలని పిటీషనర్ కోరాడు.

ఇప్పటికే రాజ్యసభలో ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దుకు ఆమోదం లభించింది. మంగళవారం అత్యవసరంగా పిటీషన్ ను విచారించాలని న్యాయవాది కోరారు. అయితే బుధవారం స్పందిస్తామని కోర్టు తెలిపింది. ఈ ఆర్టికల్ ద్వారా జమ్మూకశ్మీర్ కు అన్యాయం జరుగుతుందని పిటీషనర్ వాదించారు. బుధవారం ఆర్టికల్ 370 రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.