Begin typing your search above and press return to search.
ట్రాన్సెజెండర్లకు రక్షణ కావాలంటూ పిటిషన్
By: Tupaki Desk | 27 Sep 2020 8:10 AM GMTఆసక్తికర పిల్ ఒకటి సుప్రీంకోర్టులో దాఖలైంది. ఇప్పటివరకు లైంగిక వేధింపులు అన్నంతనే మహిళలు గుర్తుకు వస్తారు. ఇటీవల కాలంలో పురుషులు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. పురుషులు.. మహిళలు మాత్రమే కాదు తమ సంగతేమిటి?అంటూ ప్రశ్నిస్తున్నారు ట్రాన్స్ జెండర్లు.
తమకు తరచూ ఎదురవుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వారి తరఫున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం లైంగిక వేధింపుల విషయంలో మహిళలు.. పురుషులకు మాత్రమే రక్షణ పొందేలా నిబంధనలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ట్రాన్స్ జెండర్ల విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకే.. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి తగిన శిక్షలు లేకపోవటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి.. సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.