Begin typing your search above and press return to search.

కోహినూర్ వజ్రం కావాలంటున్న పాకిస్థాన్

By:  Tupaki Desk   |   3 Dec 2015 11:33 AM GMT
కోహినూర్ వజ్రం కావాలంటున్న పాకిస్థాన్
X
బ్రిటన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే పానకంలో పుడకలా పాకిస్థాన్ కూడా దానిపై ఆశపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పంజాబ్(పాకిస్థాన్) రాజు మహారాజా రంజిత్ సింగ్ మనవడు దిలీప్ సింగ్ నుంచి బ్రిటన్ ఈ వజ్రాన్ని ఎత్తుకెళ్లిందని.. దాన్ని మళ్లీ పాక్ కు తెప్పించాలని కోరుతూ జావేద్ జాఫ్రీ అనే పాకిస్థాన్ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. 1953లో ఎలిజబెత్ -2 రాణి పట్టాభిషేకం సమయంలో దాన్ని ఆమె కిరీటంలో పొదిగేందుకు తీసెకెళ్లారరని... ఆ వజ్రంపై బ్రిటిష్ వారికి ఎలాంటి హక్కు లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు... అంత్యంత విలువైన కోహినూర్ వజ్రం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రజల ఆస్తి అని ఆయన అంటున్నారు.

కాగా కోహినూర్ వజ్రం గుంటూరు సమీపంలోని కొల్లూరులో దొరికిందన్న సంగతి తెలిసిందే. దీన్ని ఇండియాకు తెప్పించేందుకు భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ దీనిపై కేసు వేసింది. ఇప్పుడు పాకిస్థాన్ ఇలా అడ్డం పడడంతో ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో అనుకుంటున్నారు. మరోవైపు కేసును క్లిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ పాకిస్థాన్ తో నాటకమాడిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.