Begin typing your search above and press return to search.

సల్మాన్ కి బెయిల్ ఎందుకిచ్చారు?

By:  Tupaki Desk   |   7 May 2015 10:11 AM GMT
సల్మాన్ కి బెయిల్ ఎందుకిచ్చారు?
X
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్‌‌‌‌స్టార్ సల్మాన్‌‌ఖాన్‌కు కష్టాలు తప్పేలా లేవు! ఈ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష ఖరారు అయ్యి రెండు రోజుల బెయిల్ పై బయటకు వచ్చిన ఆనందం ఎక్కువ సేపు నిలిచేలా లేదు! సల్మాన్ ఖాన్ కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలనీ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రలోని రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి నాయకుడు, న్యాయవాది అఖిలేష్ చౌబే ఈపిటిషన్ ను దాఖలు చేశారు! సల్మాన్‌ ఖాన్‌పై వచ్చిన అభియోగాలన్నీ రుజువైనట్టు కోర్టు తీర్పు చెప్పిన తర్వాత మరలా బెయిల్‌ ఇవ్వడాన్ని ఆ న్యాయవాది ఆక్షేపించారు. సల్మాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే విషయంలో హైకోర్టు అతి వేగాన్ని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందని... బెయిల్ పొందడానికి సల్మాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అర్హుడు కాదని, వెంటనే ఆ బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ వేసిన న్యాయవాది కోరుతున్నారు!

ఈ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ ప్రారంభం అవనుంది! అయితే శుక్రవారం బొంబాయి హైకోర్టుకు చివరి పని దినం కావడంతో ఆ రోజే బెయిల్ పై కోర్టు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది! శనివారం నుంచి కోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తిరిగి జూన్ 7వ తేదీన హైకోర్టు ప్రారంభమవుతుంది.
మొదట్లో ఈ కేసుకు సంబందించి 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి బెయిల్ పొందారు! అయితే ఈ కేసుకు సంబందించి పూర్తి విచారణ పూర్తయ్యే సమయంలో 2015 మార్చి 30 న సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్... తానే ఆ సమయంలో కారు డ్రైవ్ చేసినట్లు కోర్టుకు తెలిపారు! 2002 అక్టోబర్ నుండి పూర్తిస్థాయిలో సాగిన ఈ కేసుకు సంబందించి చివరికి 2015 మే 6 న సల్మాన్ ఖాన్ కి 5 సంవత్సరాలు జైలు శిక్ష విదిస్తూ తీర్పు వెలువడింది!
హైకోర్టులో రెండు రోజుల తాత్కాలిక బెయిల్ పొందిన అనంతరం రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో అభిమానులు, సహ నటులు, కుటుంభ సభ్యులు సల్మాన్ కు ఘన స్వాగతం పలికారు! వారిని చూసి సల్మాన్, సల్మాన్ ను చూసి వారు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు! ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ కు మద్దతుగా నాగపూర్ లో అయన అభిమానులు ర్యాలీ నిర్వహించారు. "వి ఆర్ విత్ యు సల్లు భాయ్" అంటూ ప్లాకార్డ్ లు పట్టుకుని ర్యాలీ చేపట్టారు!