Begin typing your search above and press return to search.

ముషారఫే కానీ మహనీయుడట

By:  Tupaki Desk   |   24 July 2015 12:12 PM GMT
ముషారఫే కానీ మహనీయుడట
X
దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా చిన్నారుల పాఠ్యపుస్తకాల్లో మహనీయుల గాథలుంటాయి... వాటిలో గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, వల్లభాయి పటేల్ ఇలా... ఒక్కో చోట ఒక్కో మహనీయుడి గాథలను పిల్లలకు పరిచయం చేస్తూ పాఠాలుంటాయి.. మధ్య ప్రదేశ్ లోని బడి పిల్లలకు మాత్రం పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్ కూడా మహనీయుడే... అవును ప్రభుత్వం వారికిచ్చిన పుస్తకాల్లో ముషారఫ్ మహనీయుడంటూ పాఠం కూడా ఉంది. ఇటీవల జబల్ పూర్ లో ఈ సంగతి బయటపడింది... గొప్ప వ్యక్తుల గురించి రాసిన పాఠంలో దలైలామా, సోనియాగాంధీలతో పాటు ముషారఫ్ ను కూడా ఉంచి ఆయన గురించి గొప్పగా రాశారు. ఆ పాఠంలో ముషారఫ్ ఫొటో కూడా ముద్రించారు.

ఈ సంగతి తెలుసుకున్న జబల్ పూర్ జిల్లా న్యాయవాదులు నిరసన తెలపడమే కాకుండా కేసు కూడా వేశారు. పంకజ్ జైన్ రాసిన ఈ పుస్తకాన్ని ఢిల్లీకి చెందిన గాయత్రి పబ్లికేషన్స్ ప్రచురించగా ఎన్ సీఈఆర్ టీ గుర్తింపు కూడా లభించింది. మరి ఇలాంటి పాఠాలు ఉంటే ఎన్సీఈఆర్టీ ఎలా గుర్తింపు ఇచ్చిందో ఏమో.

జబల్ పూర్ బార్ కౌన్సిల్ కు చెందిన న్యాయవాదులు మాత్రం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు, ఈ పాఠాన్ని తొలగించాలంటూ వారు నిరసనలు తెలుపుతున్నారు.