ప్రేమ తిరస్కరణ.. సాఫ్ట్ వేర్ యువతికి టార్చర్ ఇలా..

Tue Jun 02 2020 06:00:02 GMT+0530 (IST)

Rejection of love .. Software Torture For A Woman ..

ప్రేమ తిరస్కరించిందని తోటి సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై టెక్కీ దారుణంగా వ్యవహరించాడు. హైటెక్ వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో బండారం బయటపడింది.ఉత్తరప్రదేశ్ కు చెందిన 24ఏళ్ల యువతికి బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తూ వైట్ ఫీల్డ్ లో నివాసం ఉంటోంది.

నెలక్రితం ఆమెకు స్కైప్ ద్వారా గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. అశ్లీలంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులు చేశాడు. లాక్ డౌన్ తో ఊరుకున్న ఆమెకు ప్రతీరోజు అదే కాల్స్ వస్తుండడంతో ఫ్రెండ్స్ సాయంతో కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్ లో ఫిర్యాదు చేసింది. సైబర్ పోలీసులతో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బాయ్ ఫ్రెండ్స్ పై ఆరాతీశారు. కళాశాలలో తన క్లాస్ మేట్ ప్రేమను తిరస్కరించానని తెలిపింది.

ఆ యువకుడే ఇప్పుడు కక్ష పెంచుకొని రెండేళ్ల తర్వాత ఫోన్ నంబర్ తెలుసుకొని వేధిస్తున్నాడని తేల్చారు. ముంబైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి క్లాస్ మేటే ఈ పనిచేస్తున్నట్టు బయటపడింది.

అనంతరం యువతికి క్షమాపణ చెప్పి కేసును ఉపసంహరించుకునేలా యువకుడు బతిమిలాడడంతో వీరి కథ సుఖాంతమైంది. యువతి కేసును వాపస్ తీసుకోవడంతో ఈ వ్యవహారానికి ముగింపు పడింది.