Begin typing your search above and press return to search.

దీదీ సంచలనం..పాజిటివ్ లకూ ‘హోం’ క్వారంటైనేనట!

By:  Tupaki Desk   |   27 April 2020 5:03 PM GMT
దీదీ సంచలనం..పాజిటివ్ లకూ ‘హోం’ క్వారంటైనేనట!
X
క్వారంటైనేనటతృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ది నిజంగానే భిన్న వైఖరేనని చెప్పాలి. అందరూ నడిచే దారిలో తాను నడవనని - తనది సరరేటు రూటని ఇప్పటికే పలు సంఘటనల్లో దీదీ తేల్చేశారు. అయితే ప్రాణాంతక వైరస్ కరోనా విస్తృతి సమయంలోనూ ఈ తరహా తన వైఖరిని మార్చుకునేందుకు ఆమె సిద్ధంగా లేరని తేలిపోయింది. కరోనా అనుమానితులకు సెల్ఫ్ క్వారంటైన్ సరిపోతుందన్న అందరి వాదనను... దీదీ ఏకంగా కరోనా పాజిటివ్ లకు కూడా అదే సరిపోతుందంటూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. దీదీ సర్కారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం... కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి... తాను ఇంటిలోనే క్వారంటైన్ లో ఉంటానంటే... ఎవరూ అడ్డుచెప్పడానికి వీల్లేదట. ఈ మేరకు అందరిరీ ఆశ్చర్యానికి గురి చేస్తూ దీదీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా పాజిటివ్‌గా తేలినా ఇంట్లోనే క్వారంటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ దీదీ సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పాజిటివ్‌ గా తేలినవారు తమంత తాముగా క్వారంటైన్ చేసుకునే వీలుంటే వాటిని వినియోగించుకోవచ్చని - ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఈ ఉత్తర్వుల్లో దీదీ సర్కారు తెలిపింది. ఈ నిర్ణయాన్ని సమర్ధించుకున్న దీదీ... లక్షలమందిని క్వారంటైన్ చేయలేమని - ప్రభుత్వానికి కొన్ని పరిమితులున్నాయని - అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తనదైన శైలి వాదనను వినిపించారు.సాధారణంగా కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు సన్నిహితంగా మెలగడం ద్వారా వ్యాపించి ప్రాణాలను కబళింస్తుంది. అందువల్లే కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని హుటాహుటిన క్వారంటైన్ సెంటర్‌ కు తరలిస్తారు. అక్కడ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వస్తే 14 రోజులపాటు క్వారంటైన్‌ లోనే ఉంచి అప్పటికీ నెగెటివ్‌ గానే తేలితే ఇంటికి పంపిస్తారు. మరోవైపు.. ఒకవేళ పాజిటివ్ వస్తే అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసోలేషన్ వార్డుకు తరలించి కానీ, లేదా క్వారంటైన్ సెంటర్లోనే ఉంచి కానీ చికిత్స అందిస్తారు. అయితే ప్రస్తుతం బెంగాల్ నిర్ణయంతో కరోనా బాధితులు వారి కుటుంబ సభ్యులకు చేరువగా ఉంటారు. నిబంధనలను సక్రమంగా పాటిస్తే బాధితులు కోలుకునే అవకాశమున్నా.. అజాగ్రత్తగా ఉంటే మాత్రం వారి కుటుంబం మొత్తం కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు.