Begin typing your search above and press return to search.
మోడీకి నిరాశ తప్పలేదు
By: Tupaki Desk | 10 Dec 2015 4:10 AM GMTప్రఖ్యాత మ్యాగజీన్ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2015 ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నిరాశ తప్పలేదు. మొదటి నుంచి రేసులో ఉండటమే కాకుండా కీలకమైన టాప్ 8 జాబితాలో మోడీ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2015గా జర్మనీ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఎంపికయ్యారు. వలస వాదుల సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వంటి గడ్డుపరిస్థితుల్లోనూ యూరోప్ ను ముందుకు తీసుకువెళ్లడంతో మెర్కర్ ప్రదర్శించిన నాయకత్వ పటిమకు ఈ గౌరవాన్ని ఆమె పొందారని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది.
టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కోసం ఎంపిక చేసిన ఎనిమిది మంది జాబితాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ - అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ లు కూడా ఉన్నారు. మొదట్లో ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న సంగతి తెలిసిందే. మోడీతో పాటు మనదేశానికి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబాని - గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తదితరులు కూడా ఈ రేసు తొలి స్థాయిలో ఉన్నారు. అయితే తాజాగా విడుదలయిన జాబితాలో వారికి నిరాశ తప్పలేదు.