Begin typing your search above and press return to search.

వకీల్ సాబ్ ను ఎద్దేవా చేసిన మంత్రి పేర్నినాని

By:  Tupaki Desk   |   9 April 2021 10:14 PM IST
వకీల్ సాబ్ ను ఎద్దేవా చేసిన మంత్రి పేర్నినాని
X
ఏపీ మంత్రి పేర్ని నాని వకీల్ సాబ్ మూవీతోపాటు బీజేపీ తీరును ఎండగట్టారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రిలీజ్ అయిన పవన్ కళ్యాన్ 'వకీల్ సాబ్ ' సినిమా గురించి సెటైర్లు వేశారు. బీజేపీ పరిశీలకులు సినిమాల కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత సునీల్ ధియేధర్ సినిమా టికెట్ గురించి గొడవ చేశారని.. అయితే రాష్ట్రంలో నాలుగు షోలకే అనుమతులు ఉన్నాయని నాని అన్నారు.

వకీల్ సాబ్ హిట్ కు.. బీజేపీ గెలుపునకు సంబంధం ఏంటి అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పువ్వు గుర్తుకు ఓటేయ్యండి అని వచ్చారా? చెవిలో పువ్వులు పెట్టేందుకు వచ్చారా? అని పేర్ని నాని ప్రశ్నించారు.

2019 ఎన్నికల ముందు వకీల్ సాబ్ బీజేపీ గురించి మాట్లాడినవి మర్చిపోయారా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.రుపతి ఉపఎన్నికలో కమలానికి ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పండని నిలదీశారు. కడప ఉక్కు, దుగ్గరాజపట్నం హామీలు తీర్చినందుకు ఓటెయ్యాలా? ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పినందుకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు.

బీజేపీ పవన్ కి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని, హిందీ, తమిళ్ లో తీసేసిన పాచిపోయిన సినిమా వకీల్ సాబ్ అని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. దాన్నే పవన్ బీజేపీకి చూపిస్తున్నారని అన్నారు. మోదీ ఇప్పటి వరకూ టీవీ ల్లోనే నటించారు, మోదీ సినిమాల్లో కూడా చేస్తారని సునీల్ దేవ్ ధర్ చెబుతున్నారని అన్నారు. వకీల్ సాబ్ ని చూసి సీఎం జగన్ భయపడుతున్నారు అంటున్నారు, సోహ్రబుద్దీన్ కేసులో ఉన్న అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు ? అని ప్రశ్నించారు.