Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాగా సినిమాలు వాయిదా వేసుకోండి.. టాలీవుడ్ కు పేర్ని నాని షాక్

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:49 AM GMT
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాగా సినిమాలు వాయిదా వేసుకోండి.. టాలీవుడ్ కు పేర్ని నాని షాక్
X
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటి కావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే వీరిద్దరి భేటితో ఎంత వరకు లాభం..? అని అనుకుంటున్నారు. ఆర్జీవితో భేటీ తరువాత మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆర్జీవి తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడన్నారు. ఇంకా ఎవరైనా తమ అభిప్రాయాలుంటే చెప్పొచ్చన్నారు. నాతో కలవడం ఇబ్బంది అనిపిస్తే కమిటీకీ తమ సూచలను ఇవ్వాలన్నారు. సినిమా టిక్కెట్ల వివాదంపై కమిటీ వేశామని ఆ కమిటీ చెప్పిన ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం సాగుతోంది. ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు తప్పబడుతుంటే.. కొందరు ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బంది లేదన్నారు. హీరోలు నాని, సిద్దార్థలు ప్రభుత్వంపై సెటైర్లతో కూడిన విమర్శలు చేశారు. టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. అయితే సీనియర్ హీరో నాగార్జున మాత్రం ప్రభుత్వం నిర్ణయించి టిక్కెట్ల రేట్లతో ఇబ్బంది లేదన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో సినిమాలు ఆపేది లేదని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.

ఈక్రమంలో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఓ వీడియోలో ప్రభుత్వానికి 10 ప్రశ్నలు వేశారు. టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే ఎలా నష్టపోతామో ఆ ప్రశ్నల ద్వారా వివరించారు. దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాన్ని ఆర్జీవీ ప్రశ్నలకు స్పందించారు. తనతో భేటి కావొచ్చని అపాయింట్మెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి, ఆర్జీవీ భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. అయితే వీరి భేటి తరువాత పేర్ని నాని ఆర్జీవీతో మాట్లాడిన విషయం చెప్పకపోయినా ఓవరాల్ గా మాత్రం అభిప్రాయాన్నీ స్వీకరించామని తెలిపారు.

అలాగే 1955 నుంచి సినిమాటోగ్రఫీ చట్టప్రకారమే సినిమా టిక్కెట్ల రేట్లు నిర్ణయించామన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎవరినీ ఇబ్బందులకు గురిచేయలేదన్నారు. తాము ఎక్కడా చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేదని తెలిపారు. ప్రతీ వ్యక్తి తన అభిప్రాయాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు. అయితే అందరినీ సంతృప్తి పర్చలేమన్నారు. కొందరు లాజిక్ లతో మాట్లాడుతున్నారని, అయితే మేము కూడా లాజిక్ లు చెబితే ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. 2019లో ఇచ్చిన జీవో నెంబర్ 100లో పేర్కొన్న రేట్ల కంటే ఎక్కువే పెంచామన్నారు.

సినిమా పరిశ్రమపై తమకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ఆర్జీవీలో ఇంకా ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చన్నారు. ఆర్జీవి ప్రభుత్వానికి తన అభిప్రాయాలు, సూచనలు అందించారన్నారు. ప్రభుత్వం కూడా ఆర్జీవికి చెప్పాల్సింది చెప్పిందన్నారు. అయితే సినిమా టిక్కెట్ల ధరలకు సంబందించి ఓ కమిటీ వేశామని, నాతో కలవడం ఇబ్బందిగా ఉంటే కమిటీకి తమ అభిప్రాయాలు తెలపవచ్చన్నారు. ప్రతీ ఒక్కిరి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంటామన్నారు. తనతో ఎలాంటి సంబంధంల లేని హోం సెక్రటరీ ఈ టిక్కెట్ల రేట్లపై నిర్ణయం తీసుకుంటారన్నారు.

కరోనా కారణంగానే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయన్నారు. టిక్కెట్ల తగ్గింపుపై దాదాపు అందరూ ఏకీభవిస్తున్నారన్నారు. అయితే కరోనా కారణంగా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ విధించామన్నారు. అందుకే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా వేశారన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీ అవసరమన్నారు. ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే తమ సినిమాలను వాయిదా వేసుకోవచ్చని తెలిపారు. అయితే కొందరు చెబుతున్నట్లుగా టిక్కెట్ల ధరలపై సినిమాలు వాయిదా వేసుకోలేదన్నారు. సీనియర్ హీరో నాగార్జున ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఓకే చెప్పారని తెలిపారు.