Begin typing your search above and press return to search.

గాజు గ్లాస్ పోయి చాన్నాళ్ళైంది ముందు చూసుకో పవనూ !

By:  Tupaki Desk   |   17 Jun 2023 6:40 PM GMT
గాజు గ్లాస్  పోయి చాన్నాళ్ళైంది ముందు చూసుకో పవనూ !
X
చెప్పుల ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్ లో రంజుగా సాగుతోంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు పేర్ని నాని తగ్గేదే అన్నట్లుగా ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. కత్తిపూడి మీటింగులో చెప్పుతో వైసీపీ నేతలను కొడతాను అని హెచ్చరించానని పవన్ అంటే అంత పెద్ద మగోడివా నీ కేంటే పెద్ద మగోడిని నేను రెండు చెప్పులూ చూపిస్తాను చూసుకో అంటూ మాజీ మంత్రి పేర్ని నాని రిటార్ట్ ఇచ్చారు.

దానికి కౌంటర్ అన్నట్లుగా పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ నా రెండు చెప్పులూ అన్నవరం గుడి వద్ద పోయాయని ఎవరైకైనా దొరికితే ఇప్పించండి అంటూ పేర్ని నాని మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ఇపుడు పేర్ని నాని వంతు. ఆయన్ని మీడియా ఇదే విషయం మీద ప్రశ్నిస్తే అవునా పవన్ కళ్యాణ్ రెండు చెప్పులూ పోయాయా. ఎక్కడా అని వెటకారం జొప్పించి మరీ ప్రశ్నించారు.

ఆయన రెండు చెప్పులు ఈ నెల 13న అన్నవరంలో పోతే ఆయనకు 16న గుర్తుకు వచ్చిందా మంచిది అని సెటైర్లు వేశారు. అంతటితో ఆగకుండా నా చెప్పు ఒకటి పోయి తొమ్మిది నెలలు అయింది నేను ఎవరితో చెప్పుకోను సామీ అంటూ తిరిగి పవన్ మీదనే ఇండైరెక్ట్ గా కౌంటరేశారు. గత ఏడాది అక్టోబర్ 19న లింగమనేని వారి వెంకటేశ్వరస్వామి గుడికి తాను వెళ్తే ఒక చెప్పు పోయిందని పేర్ని నాని అంటున్నారు.

నా చెప్పు పోయిందని ఎదురుగా జనసేన ఆఫీసులో ఉన్న పవన్ని అనుమానించలేము కదా అంటూ సెటైర్లు పేల్చారు. అయినా పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు పోతే అంత బాధ ఎందుకు పాత చెప్పులు కొన్న ప్రొడ్యూసర్లే మళ్ళీ కొత్త చెప్పులు కొనిస్తారు అని వెటకారం ఆడారు.

పవన్ తో పాటే మంగళగిరికి దిగిపోయిన కొందరు నిర్మాతలు ఇక్కడే షూటింగులు చేసుకుంటామని అంటున్నారు కదా అందువల్ల వారే చెప్పులు కొనిస్తారులే కంగారు పడవద్దని చెప్పండి అని కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు చెప్పులో కోసం ఇంత గోల ఎందుకు పవన్ గారు. మీ పార్టీకి ఇచ్చిన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ పోయి చాలా కాలం అయింది. ముందు ఆ విషయంలో ఆలోచించండి. ఈ చెప్పుల గోల అంతా ఎందుకు అంటూ అదిరిపోయే రిటార్ట్ ఇచ్చేశారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక చెప్పు అంటే పేర్ని నాని రెండు చెప్పులు తీశారు. పవన్ ఒక రిటార్ట్ వేస్తే పేర్ని నాని రెండిందాలుగా రిటార్ట్ ఇచ్చేశారు. మరి దీని మీద కాకినాడ సభలో పవన్ ఎలా రియాక్ట్ ఆవుతారో చూడాల్సి ఉంది.