Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ని విశాఖకు తరలిస్తారా?
By: Tupaki Desk | 3 Feb 2023 10:00 PM GMTటాలీవుడ్ ని ఏపీకి తరలించాలనే ఆలోచనలు చేస్తున్నారా?.. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖని ప్రకటించిన ప్రభుత్వం అక్కడే టాలీవుడ్ కు భారీ గా స్థలాలు కేటాయించి అక్కడే భారీ స్టూడియోల నిర్మాణానికి పచ్చ జెండా ఊపనుందా? అంటే ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అవునంటూ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న కొంత మంది నటీనటులు ఏపీ వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలాప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతల్ని అప్పగించింది. శుక్రవారం సంస్థ కార్యాలయంలో పోసాని కృష్ణ మురళి బాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చల్లా మాధవరెడ్డి, ఫైబర్ నెట్ గౌతమ్ రెడ్డి, కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పోసాని కృష్ణమురళికి పేర్నినాని శుభాకాంక్షలు అందజేశారు. సీఎం జగన్ కు పోసాని కృష్ణమురళి ఆప్తులన్నారు. జగన్ కోసం ఎంతదూరమైనా వెళ్లే వ్యక్తి ఆయన అని ప్రశంసలు కురిపించారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు.
100 ఎకరాల్లో స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ఆ కార్యాన్ని ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో నిర్వహించాలనే సంకల్పం ప్రభుత్వానికి వుంది. ఇప్పుడు ఎఫ్ డీసీ చైర్మన్ గా ఆ బాధ్యత పోసాని కృష్ణమురళికి వచ్చింది. సీఎం జగన్ కోసం పోసాని ఎంతదూరమైనా వెళతారు` అని ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇదే వేదిపై మాట్లాడిన సి. కల్యాణ్ సీఎం .గన్ ఆలోచనల్ని పోసాని కృష్ణమురళి ఖచ్చితంగా అమలు చేస్తారని, ఇండస్ట్రీని విశాఖకు తీసుకెళ్లాల్సిందేనని చెప్పుకొచ్చారు.
మరి ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ పెద్దలు, స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.