Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కౌంటర్.. వైసీపీ వెన్నెపూస రాసినట్టు.. ఇదే స్ట్రాటజీ

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:20 AM GMT
కేసీఆర్ కు కౌంటర్.. వైసీపీ వెన్నెపూస రాసినట్టు.. ఇదే స్ట్రాటజీ
X
భారత రాష్ట్రసమితి ఏర్పాటు తరువాత కేసీఆర్ తొలిసారి ఖమ్మంలో సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ జాతీయ రాజకీయాలనుద్దేశించే ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం దిగిపోతుందని, టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. అయితే ఖమ్మంలో సభ నిర్వహించడం ద్వారా ముందుగా తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభావితం చేస్తుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలోనూ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

కేసీఆర్ చేసిన ఈ ప్రసంగంపై ఏపీ అధికార వైసీపీ నాయకులు వెంటనే స్పందించారు. కానీ వారి స్పందనలో పెద్దగా పసలేదని తెలుస్తోంది. వైసీపీపై ఎవరూ ఆరోపణలు చేసినా పేర్ని నాని రియాక్టవుతారు. ఇప్పుడు కూడా ఆయనే మైక్ పట్టుకున్నారు. బీఆర్ఎస్ సభ పై ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అంటే బీఆర్ఎస్ ను ఏపీలో ఆహ్వానించడం లేదని పైపైన చెబుతుండడంతో కేసీఆర్ కు వెన్నె పూసినట్లు విమర్శించారని రాజకీయాంగా చర్చ సాగుతోంది.

ఖమ్మంలో నిర్వహించిన సభకు ఏపీ నుంచి కూడా ప్రజలు వచ్చారు. వందకు పైగా బస్సుల్లో అక్కడి బీఆర్ఎస్ నాయకులు జనాన్ని తీసుకువచ్చారు. దీంతో బీఆర్ఎస్ కు ఆదరణ ఎలా ఉందో తెలుసుకోవచ్చని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అన్నారు. అంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నట్లు మాట్లాడారా..? అనేది తెలియదు. కానీ అక్కడి రాజకీయాలను బీఆర్ఎస్ ప్రభావితం చేస్తాయనడంతో ఇప్పడు ప్రజలు సంతోషంగా లేరా..? అన్న చర్చ సాగుతోంది. తమ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని గతంలోనూ కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. కానీ వైసీపీ నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

చిన్న పార్టీల గురించి పట్టించుకోం అంటూనే నిత్యం జనసేన పై విరుచుకుపడుతున్న వైసీపీ నాయకులు పక్క రాష్ట్రం బీఆర్ఎస్ ఏపీలో కమిటీలు వేసేదాకా చూస్తున్నారంటే .. పరోక్షంగా కేసీఆర్ ను ఆహ్వానించడమేనా..? అని అనుకుంటున్నారు. అటు కేసీఆర్ సైతం త్వరలో విజయవాడలో పర్యటిస్తానని, ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభిస్తానని అన్నారు. ఒకప్పుడు వైసీపీ నేత జగన్ వరంగల్ పాదయాత్ర కోసం రైలులో వెళ్తుండగా మహబాబాబాద్ వద్దే అడ్డుకున్నారు. రాళ్లదాడి కూడా చేశారు. అప్పుడు తెలంగాణ వాదం బలంగా ఉన్నందున ప్రజల్లోనూ ఆ వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్ నేరుగా ఆంధ్రాకు వస్తానని చెప్పినా వైసీపీ నాయకులు నోరుమెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉందని పలు సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు. అయితే ప్రతీసారి ఎన్నికల సమయంలో ఆంధ్రా పాలకులు మళ్లీ వస్తున్నారంటూ తెలంగాణ ప్రజల్లో భేషజ్వాలాలు ఎందుకు రేపుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాకు వెళ్లి రాజకీయం చేస్తానని ఎందుకు అంటున్నారంటున్నారు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఆంధ్రాలో విస్తరించేందుకు వైసీపీనే సహకరిస్తుందా..? అన్న చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.