Begin typing your search above and press return to search.

శాశ్వతంగా లిఖించుకోవాలి.. కేసీఆర్ కొత్త కోరిక

By:  Tupaki Desk   |   30 Nov 2019 5:02 AM GMT
శాశ్వతంగా లిఖించుకోవాలి.. కేసీఆర్ కొత్త కోరిక
X
తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులన్నింటిని తొలి ముఖ్యమంత్రిగా తానే చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు తీర్చేలా ఇప్పటికే కాళేశ్వరం కట్టిన కేసీఆర్ ఇప్పుడు సరికొత్త ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణకు కొత్త అసెంబ్లీ, సెక్రెటేరియట్ నిర్మాణాలు కట్టించి అందులో శిలాఫలకాలపై తన పేరును శాశ్వతంగా లిఖించుకోవాలని కలలు గంటున్నారు. కేసీఆర్ ఉన్నా లేకున్నా కేసీఆర్ కట్టించిన ఆ భవనాలు మాత్రం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి. అలా తన పేరును ఎల్లలు దాటించి శాశ్వతం చేసుకోవాలని యోచిస్తున్నారు.

తెలంగాణ సెక్రెటేరియట్ వాస్తుప్రకారం లేదని కేసీఆర్ గద్దెనెక్కాక అందులోకి కాలు కూడా పెట్టడం లేదు. ప్రగతి భవన్ కట్టుకొని అందులోంచే తెలంగాణను పరిపాలిస్తున్నారు. ఇక ఇప్పుడున్న తెలంగాణ అసెంబ్లీ భవనం పురాతనమైంది. నిజాంల కాలంలో కట్టినది.. చాలా సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయం నిర్మాణాలకు కేసీఆర్ ప్లాన్ చేశారు.

అయితే ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీకి శంకుస్థాపన చేసినా హెరిటేజ్ భవనం కూల్చివేత తగదంటూ హైకోర్టుకు ఎక్కి కొందరు అడ్డుకున్నారు. ఇక ఇప్పుడున్న సచివాలయం కూల్చివేతపై సైతం హైకోర్టుకెక్కారు. దీంతో ఈ పనులన్నీ ఆగిపోయాయి.

ఇక తన కలను నెరవేర్చుకోవడానికి కేసీఆర్ కొత్త ప్లాన్ చేస్తున్నారట.. ఇక ఈ కూల్చివేతలు, కూలగొట్డడాలు లేకుండా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లేదా బైసన్ పోలో గ్రౌండ్స్ కావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారట.. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం కేటీఆర్ ఢిల్లీ వెళ్లి విస్తృతంగా లాబీయింగ్ చేశారు. బెంగళూరులో కట్టిన మాదిరిగా సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ ఇలా అన్నీ ఒకేచోట కట్టాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. కేంద్ర మంత్రులను కలిసి కేటీఆర్ ఈ మేరకు రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. మరి కేసీఆర్ కల తొందరలోనే నెరవేరబోతోందని అధికార వర్గాలు అంటున్నాయి.