Begin typing your search above and press return to search.

కరోనా నేర్పిన పాఠమిదీ..!!

By:  Tupaki Desk   |   18 April 2020 1:30 AM GMT
కరోనా నేర్పిన పాఠమిదీ..!!
X
ఇటలీ సహా కొన్ని అభివృద్ధి చెందిన విదేశాల్లో కరోనాతో వృద్ధులు చనిపోతుంటే వారి వద్దనున్న కోట్ల డాలర్లు వారిని బతికించలేకపోయాయి. మందే లేని కరోనా ముందు వారి వద్దనున్న కాగితపు నోట్ల కట్టలు చిత్తు కాగితాలయ్యాయి. అందుకే చాలా మంది రోడ్లపై డబ్బులు పడేసిన వైనం మనం వార్తల్లో చదివాం.. కరోనా వైరస్ మనుషులపై ఎంత ప్రభావం చూపిందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదీ..

కరోనా వైరస్ మనుషులకు ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదన్న వాస్తవాన్ని తెలిపింది. మానవ జీవితాలను చాలా సింపుల్ గా మార్చేసింది. కోట్ల డబ్బు, లగ్జరీ లైఫ్ అవసరం లేదని.. బతికుంటే చాలు అన్న వాస్తవాన్ని కళ్లకు కట్టింది. దీంతో ఇప్పుడు వృథా ఖర్చులన్నీ మానేసి ఇంటి అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. చికెన్ ముక్క, మందులేనిదే ముద్దదిగని వారు సైతం సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు.

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో కేవలం బతకడమే ప్రథమ కర్తవ్యంగా జనాలకు మారిపోయింది. లగ్జరీ, ఆధునిక జీవన శైలికి స్వస్తి పలికి సాధారణ జీవితం గడిపేలా చేస్తోంది. అత్యవసరపు విషయాలకే పరిమితం అవుతున్నారు. తిండి, ఆహారం ఉంటే చాలు అన్న చందంగా పరిస్థితి మారిపోయింది.

ఇక కరోనా వైరస్ తెచ్చిన మరో పెద్ద మార్పు హంగులు , ఆర్భాటాలు బంద్ అయిపోయాయి. ఇన్నాళ్లు పుట్టినరోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటే చాలు తమ స్టేటస్ కనిపించేలా కోట్లు ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేస్తే కరోనా అటాక్ కావడం కాయం. దీంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకుంటున్నారు. కోట్లకు అధిపతి అయిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు పెళ్లి సైతం ఈరోజు ఉదయం పట్టుమని 20 మంది సమక్షంలో జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమాలు, షికార్లు, షాపింగ్ లు, విదేశీ టూర్లు అనేవారంతా కరోనా దెబ్బకు ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇక కరోనాతో అందరిలోనూ గొప్ప మార్పు వచ్చింది. చేయి కడగకుండానే తిండి తినే వారంతా ఇప్పుడు శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, సబ్బులతో రోజుకు నాలుగైదు సార్లు కడుగుతూ శుచి, శుభ్రత పాటిస్తున్నారు. చెత్త చెదారం పడేసే వారు కూడా పద్ధతులు పాటిస్తుండడం విశేషం. ఇప్పుడు డబ్బు కంటే ప్రాణం ప్రాధానం.. కుటుంబమే ప్రాధామ్యం అని అంటున్నారు.

కరోనా కారణంగా అందరిలోనూ వచ్చిన గొప్ప మార్పు సాధారణ జీవితానికి అలవాటు పడడం.. అవును సినీ సెలెబ్రెటీల నుంచి సామాన్యుల దాకా కరోనా టైంలో బయట తిండి - లగ్జరీలకు దూరంగా ఇంట్లోనే చేసింది తింటూ.. స్వతహాగా చేసుకుంటూ సాదాసీదాగా బతికేస్తున్నారు. సింపుల్ జీవితానికి అలవాటుపడుతున్నారు. ఇది నిజంగా కరోనా సాధించిన గొప్ప విజయమే అని చెప్పవచ్చు. బతుకు విలువను నేర్పిన ఘనత కరోనాదే అని చెప్పవచ్చు. ఈ టైంలో కాసులు - ధనిక - పేద అనే తేడా లేకుండా అందరినీ ఇళ్లకు పరిమితం చేసి సామాజిక సమసమాజాన్ని స్థాపించిన ఘనత కరోనాదే.. ఇతర గ్రహాల మీద అడుగిడిన మనిషికి కూడా కరోనాకు మందు లేకుండా చేసి జీవన తత్వాన్ని బోధించిన కరోనా వైరస్ అంతిమంగా చెడు చేసినా మనుషుల్లో మార్పునకు కారణమైందని చెప్పవచ్చు.