Begin typing your search above and press return to search.
సింపుల్ గా పౌరసత్వం వదులు కుంటున్నారు.. ఎందుకంటే?
By: Tupaki Desk | 1 Jan 2022 7:30 AM GMTకొంతమంది మన దేశ పౌరసత్వాన్ని చాలా సింపుల్ గా వదిలేసుకుంటున్నారు. ఈ దేశంలో పుట్టి... ఇక్కడి గుర్తింపును రద్దు చేసుకుంటున్నారు. గడిచిన ఐదేళ్లలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2017 నుంచి ఈ సంఖ్య మరీ పెరుగుతూ వస్తోంది. 2019లో రికార్డు స్థాయిలో అనగా 1.5 లక్షల మంది భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటూ అప్లికేషన్ ఇచ్చారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా 6 లక్షల మంది ఇక్కడి నుంచి కుటుంబాలతో సహా పూర్తిగా వలసలు వెళ్లిపోయారు. వీరిలో అందరూ కూడా సంపన్నులే. ఇక్కడ ఆర్థికంగా బాగా ఎదిగిన వారు విదేశాల్లో స్థిరపడడానికి కుటుంబాలతో సహా శాశ్వతంగా ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత గుర్తింపును రద్దు చేసుకుంటన్నారు.
విదేశాల్లో విలాసవంతమైన జీవితం, తమకు తగిన గుర్తింపు, రాయితీల దృష్ట్యా సంపన్నులు భారత్ నుంచి శాశ్వతంగా వలస వెళ్తున్నారు. కుటుంబాలతో సహా అక్కడే సెటిల్ అవుతున్నారు. ఇందులో 40 శాతం మంది అగ్రరాజ్యమైన అమెరికాలోనే ఉంటున్నారు. మిగతా స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ఉన్నాయి. వీరంతా కూడా ఆయా దేశాల్లో పౌరసత్వం సంపాదిస్తున్నారు. భారీ పెట్టుబడులతో చాలామంది ఈ పౌరసత్వాన్ని కొనుకుంటున్నారు.
మనదేశంలోని సంపన్నులను పెట్టుబడుల కోసం ఇతర దేశాలు ఆహ్వానిస్తాయి. వాటిలో కరేబియన్ దీవులు, బహామా ఐలాండ్స్, వర్జినియా వంటివి కూడా శ్రీమంతులకు వెల్ కమ్ చెబుతున్నాయి. అంతేకాకుండా వారికి వీఐపీ స్టేటస్ కల్పిస్తున్నాయి. ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన చాలామంది శ్రీమంతులు ఇతర దేశాల్లో స్థిరపడడానికి వలస వెళ్తున్నారు. ఏకంగా కుటుంబాలతో సహా అక్కడికి పోతున్నారు.
విదేశాల్లో స్థిరపడడం కోసం ఆ దేశాల గుర్తింపును పొందుతున్నారు. ద్వంద్వ పౌరసత్వాలను ఆమోదించని దేశాల్లో ఉండేవారి ఇక్కడి గుర్తింపును వదులుకుంటున్నారు. భారత దేశంలోని పౌరసత్వం రద్దు చేసుకుంటూ దరఖాస్తులు చేస్తున్నారు. ఇక ప్రజాధనాన్ని దోచుకునే ఆర్థిక నేరగాళ్లు కూడా ఇతర దేశాల్లో మంచి గుర్తింపును పొందుతున్నారు. ఆలాంటి వారికి కూడా ఇతర దేశాలు పౌరసత్వం కల్పిస్తున్నాయి. ఈ విధంగా సంపన్నులు మన దేశంలోకన్నా ఇతర దేశాల్లో ఉండడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.