Begin typing your search above and press return to search.
అన్నీ మర్చిపోతున్నారా! అయితే మీ పని మటాషే!
By: Tupaki Desk | 20 Sep 2020 11:30 PM GMT‘భలేభలే మగాడివోయ్’ చిత్రంలో హీరో నాని అన్నీ మర్చిపోతూ ఉంటాడు. మతిమరుపు కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది. అది సినిమా కాబట్టి మనమూ దాన్ని ఫన్నీగా తీసుకున్నాం. అయితే నిజజీవితంలో మతిమరుపు ప్రధాన లక్షణంగా ఉండే అల్జీమర్స్ అనేది ఓ పెద్ద వ్యాధి అని ఎంతమందికి తెలుసు. ఆ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారని ఎవరన్నా ఊహించారా? 2050 నాటికి 15.2 కోట్ల మంది ఈ వ్యాధి (అల్జీమర్స్) బారిన పడతారని ఓ నివేదిక వెల్లడించింది. ఇది నిజంగా ఆందోళన చెందవలసిన విషయం. మన ఇంట్లో చాలా మంది పెద్దవాళ్లు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వయసు మీద పడ్డప్పడు ఈ మతిమరుపు కామనే అని మనం లైట్ తీసుకుంటాం. కానీ ఆ వ్యాధి ముదిరి వాళ్ల ప్రాణాలనే హరించి వేస్తుంది అనేది ఓ చేదు వాస్తవం. మన ఇండ్లల్లో ఉండే పెద్దవాళ్లు చొక్కాలకు గుండీలు పెట్టుకోవడం మర్చిపోతుంటారు. ఎవరన్నా తిట్టినా పట్టించుకోరు? తిండి తినడం మొదలుకొని ప్రతివిషయం మర్చిపోతుంటారు.. అయితే ఈ లక్షణాలన్ని అర్జీమర్స్వే అంటున్నారు శాస్త్రవేత్తలు. 45 ఏళ్ల వయస్సులో ఈ వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. 65 దాటకా తీవ్రస్థాయికి చేరుకుంటాయి.
మనదేశంలో ఎంతమంది?
130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 40 లక్షల మంది అల్జీమర్స్ రోగులు ఉన్నారన్నది ఆ భయంకరమైన నిజం.
అల్జీమర్స్ రోగుల్లో చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే. 2030 నాటికి దేశంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 75 లక్షలకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసుపు వాడకంతో మనదేశంలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మతిమరుపు ముదిరితే ఈ అల్జీమర్స్ సమస్య వస్తుంది. దీనికి ప్రత్యేకమైన చికిత్స కూడా అందుబాటులో లేదు. వ్యాధిని కొంతమేర నియంత్రించవచ్చు. అయితే 65 ఏళ్లు వచ్చేవరకు ఈ వ్యాధి ఉన్నట్టు మనమే గుర్తించం.
ప్రతి మతిమరుపు.. అల్జీమర్స్ కాదు
అయితే మతిమరుపు ఉన్నంత మాత్రాన దాన్ని అల్జీమర్స్‌గా పరిగణించలేం. పార్కిన్‌సన్స్ వ్యాధి, మెదడుకు తీవ్రమైన దెబ్బ తగలడంతో కూడా మనకు మతిమరుపు సంభవించవచ్చు అయితే అల్జీమర్స్‌కు కూడా మతిమరుపే ప్రధాన లక్షణం. మనకు వచ్చిన మతిమరుపు అల్జీమర్స్ అవునో కాదో తెలుసుకోవాలంటే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. మాట, రాతల్లో సమస్యలు ఏర్పడటం, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ప్రాంతాలకు సంబంధించిన విషయాలు గుర్తులేకపోవడం వంటివన్నీ అల్జీమర్స్ లక్షణాలుగా పరిగణించవచ్చు. భావోద్వేగాల్లో మార్పులు, బంధు మిత్రులకు దూరంగా ఉండటం కూడా ఈ వ్యాధి సమస్యలే. మెదడు కణజాలాన్ని పరీక్షిస్తేనే అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించగలం. అంటే మరణం తర్వాతే వ్యాధిని గుర్తించగలమన్నమాట. కుటుంబ చరిత్ర, జన్యుపరీక్షల ఆధారంగా కూడా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. ఎంఆర్ఐ. సీటీ స్కాన్, పీఈటీ వంటి స్కాన్ల ద్వారా మెదడు నిర్మాణం, అందులోని తేడాలను తెలుసుకుంటారు. వీటన్నింటి ఆధారంగా వైద్యులు తుది నిర్ణయానికి వస్తారు. ధూమపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మెదడకు మేతపెట్టే ఫజిల్స్లాంటివి పూర్తిచేయడం, వంటి జాగ్రత్తలతో ఆ రోగాన్ని దరిచేరకుండా చేసుకోవచ్చు.