Begin typing your search above and press return to search.
రియల్ హీరో అనిపించుకున్న ఆర్. నారాయణమూర్తి
By: Tupaki Desk | 28 Jun 2021 11:30 AM GMTపీపుల్స్ స్టార్, ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయచట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ లోనూ రైతుల నిరసనకు సంఘీభావంగా 'చలో రాజ్ భవన్ 'ను రైతులు, రైతు సంఘాల నాయకులు చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీలు ఈ రాజ్ భవన్ ముట్టడిని చేపట్టాయి. విశేషం ఏంటంటే.. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఈ ర్యాలీలో హీరో నారాయణ మూర్తి పాల్గొన్నారు.
పోలీసులు నిరసనను ఈ నిరసనను అడ్డుకున్నారు. గవర్నర్ అధికారిక నివాసం వైపు ర్యాలీ చేయడానికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆర్ నారాయణ మూర్తి కూడా ఉన్నారు.
అరెస్ట్ సమయంలో ఆర్. నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. 'కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు రైతులకు ఎటువంటి ప్రయోజనం కలిగించవని.. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
2006లో బీహార్ ప్రభుత్వం కూడా ఇలాంటి వివాదాస్పద చట్టాలను తీసుకొచ్చిందని.. దాని వల్ల బీహార్ రైతులు రోజువారీ కూలీలుగా మారారని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం రైతులు ఎంత ఆందోళన చేస్తున్నా ఈ వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకోలేదని అన్నారు.
బీహార్ లో ఫ్లాప్ అయిన ఈ చట్టాలతో దేశవ్యాప్తంగా పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నారాయణ మూర్తి అన్నారు. వీటివల్ల ప్రయోజనం కంటే ఎక్కువ హాని కలిగించేలా ఉన్నాయని.. వెంటనే చట్టాలని వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఆర్.నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభాలుగా ఉన్న విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను ప్రైవేటీకరించడంపై కేంద్రం పునరాలోచించాలని నారాయణ మూర్తి కోరారు.
ఆర్.నారాయణ మూర్తి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన చేరాలనుకుంటే అన్ని పార్టీలు రెడ్ కార్పేట్ వేస్తాయి. కానీ కమ్యూనిస్టు భావాలున్న నారాయణమూర్తి ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై స్వతహాగా పోరాడాడు. రైతులకు నష్టం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. నిష్పాక్షికంగా కేంద్రం తీరును కడిగేశాడు. ఇన్నేళ్ల సినిమా జీవితంలో సినిమాల్లోనే ప్రశ్నించిన నారాయణమూర్తి ఇప్పుడు నిజజీవితంలోనూ ఆ పాత్ర పోషించి రియల్ హీరో అనిపించుకున్నాడు.