Begin typing your search above and press return to search.

ఇప్పటంలో పవన్ నడుస్తుంటే.. వెనుక నుంచి కేకలు విన్నారా?

By:  Tupaki Desk   |   5 Nov 2022 7:32 AM GMT
ఇప్పటంలో పవన్ నడుస్తుంటే.. వెనుక నుంచి కేకలు విన్నారా?
X
కష్టపడి కట్టుకున్న ఆస్తుల్ని కళ్ల ముందు కూలగొడుతుంటే.. ఆ ఆవేదన అంతాఇంతా కాదు. దానికి రాజకీయం కారణమైతే.. ఆ పరిస్థితి మరెంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే ఉండదు మొన్నటికి మొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడలో 2 సెంట్లు (98 గజాలు) ఇరిగేషన్ శాఖకు చెందింది ఉందన్న పేరుతో.. కోర్టులో కేసు నడుస్తున్నా.. తెల్లవారుజామున ఇంటి గోడలు దూకి మరీ ఆయన్ను.. ఆయన కుమారుడ్ని అరెస్టు చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. శుక్రవారం ఇప్పటం గ్రామానికి చెందిన తెలుగుదేశం.. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు.. సానుభూతిపరులకు చెందిన ఆస్తుల్లో ఆక్రమణలు ఉన్నాయని పేర్కొంటూ కూల్చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయంగా తేడాలు ఉండొచ్చు కానీ.. ఇలా ఆస్తుల మీదకు రావటం ఏమిటి? అది కూడా సామాన్య కార్యకర్తలు.. సానుభూతిపరుల మీదా? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటం గ్రామానికి బయలుదేరి వెళ్లారు పవన్ కల్యాణ్. ఆయన ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకోగా.. దాన్ని వదిలేసి.. కాలి నడకన కొంత దూరం.. ఆ తర్వాత మరో వాహనంలో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు.

తనను అభిమానిస్తున్నారన్న కారణంగా ఆస్తుల్ని ధ్వంసం చేసిన తీరుపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి వద్దకువెళ్లారు. ఈ సందర్భంగా జేసీబీ యంత్రాలతో కూల్చేసిన నేపథ్యంలో.. ఆ సిమెంట్ దిమ్మల మీద నుంచే నడుచుకుంటూ వెళ్లారు.

ఈ సందర్భంగా అక్కడున్నవారు పెద్ద ఎత్తున.. 'అన్నా.. జాగ్రత్త' అంటూ పెద్ద పెత్తున కేకలు వేయటం.. అరుస్తూ.. తమ అభిమాన నేతను అలెర్టు చేయటం కనిపించింది. పరామర్శల సమయంలో ఉద్రికత్తంగా ఉండే వాతావరణంలోనూ తాము అభిమానించే పవన్ కు ఏం కాకూడదని.. ఆయనకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదన్నట్లుగా జనసైనికుల తీరు చూస్తే.. రోటీన్ రాజకీయపార్టీలకు భిన్నంగా జనసైనికులు కనిపించారని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.