Begin typing your search above and press return to search.
హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినప్పుడు ప్రజాభిప్రాయం అడిగారా బాబూ
By: Tupaki Desk | 3 Aug 2020 11:30 AM GMTతాను చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా చంద్రబాబు రాజకీయం ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ తీవ్ర విమర్శ ఉంది. ఎప్పుడూ తన మాటే నెగ్గాలనుకునే చంద్రబాబుకు.. ప్రతిపక్షంలో ఉన్నా సరే బలమైన మీడియాతో మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం-జగన్ ముందు తన పప్పులు ఉడుకపోయేసరికి జీర్ణించుకోవడం లేదట.. అందుకే అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు వితండవాదంపై వైసీపీ నేతలు పాత జ్ఞాపకాలను నెమరువేసి మరీ కడిగేస్తున్నారు.
రాష్ట్రం విడిపోయిన సమయం అది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిని చేసింది. హైదరాబాద్ నుంచే ఏపీ, తెలంగాణ పాలిస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసి ప్రచారం చేశాయి. ఆ ఎన్నికల్లో ప్రజలంతా రాజధాని లేని రాష్ట్రానికి సీనియర్ అయిన చంద్రబాబే న్యాయం చేస్తాడని వైసీపీని ఓడించి చంద్రబాబును గెలిపించారు.
పీకల్లోతు అప్పుల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు సరైన బడ్జెట్ ఆదాయం లేనప్పుడు హైదరాబాద్ నుంచే పరిపాలన చేసుకొని కొంచెం ఆర్థికంగా వెసులుబాటు చేసుకునే అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కొని రాత్రికి రాత్రి అమరావతికి మకాం మార్చేశారు. ఏదో కమిషన్ పేరు చెప్పి రైతుల దగ్గర 30వేల ఎకరాలు తీసుకొని మొత్తం 6 తాత్కాలిక భవనాలతో ఏపీ నుంచే పాలన నడిపించాడు.
మరి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినప్పుడు చంద్రబాబు ప్రజాభిప్రాయం అడిగారా అంటే లేదు అనే చెప్పాలి. ఇదే విషయాన్ని చంద్రబాబును నిగ్గదీసి అడుగుతున్నారు వైసీపీ నేతలు. నాడు హైదరాబాద్ నుంచి మీ సొంత స్వార్థం కోసం కేసుల్లో ఇరుక్కొని అమరావతికి వచ్చినప్పుడు ప్రజాభిప్రాయం అడగని మీరు ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపులో ప్రజాభిప్రాయాన్ని ఎందుకు లింక్ చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.