Begin typing your search above and press return to search.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పై పీపుల్స్ పల్స్ సర్వే ఏం చెప్పింది?
By: Tupaki Desk | 8 May 2023 10:44 AM GMTయావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని. దీనికి కారణం లేకపోలేదు. దక్షిణాదిన ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే కావటం. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సర్కారు ను ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకున్నా.. కిందా మీదా పడి.. ఆపరేషన్ కర్ణాటక ను చేపట్టి నెలల తరబడి కష్టం తర్వాత అధికారంలోకి రావటం తెలిసిందే.
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మీద బోలెడంత వ్యతిరేకత ఉందన్న విషయం పలువురి నోటి నుంచి వినిపిస్తున్న వేళ.. ఎన్నికల ఫలితాల మీద ఉత్కంట పెరుగుతోంది. దీనికి కారణం లేదు. తమ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తించిన కమలనాథులు.. ఈ ఎన్నికల్లో తమ సర్వశక్తుల్ని వొడ్డుతున్నారు. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు రెండు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు.. ప్రచారాంశాలు.. ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి మేనిఫెస్టోలు ఏం చెప్పాయి? లాంటి విషయాల మీద సర్వే చేసింది పీపుల్స్ పల్స్.
ఈ సంస్థ విడుదల చేసిన వివరాల్ని చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప అధిక్యత లభిస్తుందన్న విషయాన్ని వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 100కు పైగా స్థానాల్ని సొంతం చసుకుంటుందన్న విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో బీజేపీ కూడా ఇంచుమించు 100 వరకు సీట్లు వస్తాయని.. ఇక జేడీఎస్ తనకు పట్టున్న ప్రాంతాల్లో 24 స్థానాల్లో విజయం సాధించొచ్చు అన్న విషయాన్ని వెల్లడించింది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 105-117 సీట్లు వస్తే.. బీజేపీకి 81-93 చోట్ల గెలుస్తుందని లెక్క కట్టింది. జేడీఎస్ 24-29 వరకు.. ఇతరులు 1-3 స్థానాల వరకు గెలిచే వీలుందని పేర్కొన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతంలో 0.3 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని లెక్క కట్టారు. 2018లో కాంగ్రెస్ సాధించిన 38.14 శాతం ఓట్ల కు అదనంగా ఈసారి ఓట్లు పడతాయని చెబుతున్నారు. సర్వే అంచనాల ప్రకారం 41.4 శాతం వరకు పొందటం ఖాయమంటున్నారు. ఇంకా.. ఎన్నికలకు మరో రెండు రోజులు సమయం ఉన్నందున.. చివరి నిమిషాల్లో చోటు చేసుకునే పరిణామాలు సైతం ఫలితాల మీద ప్రభావితం చూపుతాయంటున్నారు.
56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన ఈ సర్వేను మే 1 నుంచి మే 5 మధ్యన నిర్వహించారు. ప్రతినియోజకవర్గంలోని మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసి.. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దా 20 శాంపిల్స్ తో సర్వే రిపోర్టును తయారు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సర్వేలో భాగంగా స్త్రీ.. పురుషుల మధ్య శాంపిల్ సేకరణలో వయసు.. కులం.. పేద.. సంపన్నుల మధ్య తగు నిష్పత్తిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి.. ఈ సర్వే అంచనాలు ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తాయన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.