Begin typing your search above and press return to search.
బాబూ... ఇందుకే సీబీఐ కావాలి
By: Tupaki Desk | 25 Nov 2018 4:50 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఎందుకు చేస్తున్నారో తెలుగు ప్రజలకే కాదు.... యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తేటతెల్లమైందంటున్నారు. ఎలా అంటారా... ఇదిగో ఇలా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాడులు చేసి ఆయన 5700 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను ముంచారని తేల్చారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన సుజనా చౌదరి వంటి తెలుగుదేశం నాయకులను రక్షించుకుందుకే చంద్రబాబు నాయుడు సిబీఐని ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతించడం లేదంటూ విమర్శలొస్తున్నాయి. శనివారం నాడు అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సీబీఐని తాను నిషేధించడానికి సహేతుకమైన కారణమే ఉందంటూ సమర్ధించుకున్నారు. అయితే సుజనా చౌదరి వంటి నాయకులను, బ్యాంకులను మోసం చేసిన వారిని రక్షించుకోవడమే చంద్రబాబు నాయుడి సహేతుకతా అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన చంద్రబాబు నాయుడికి నాలుగేళ్ల పాటు వారి ఆంతర్యం తెలియలేదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్ల పాటు కలిసున్న వారిపై హఠత్తుగా ఏ ఒక్కరు కక్ష సాధింపు చర్యగా వ్యవహరించరని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరితో పాటు అనేక మంది నాయకులు బ్యాంకులను, ఇతర సంస్ధలను మోసం చేశారనే నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి చేరాయని, వీటి ఆధారంగానే వారి వారి ఇళ్లపైనా, కార్యాలయాలపైనా ఈడీ దాడులు చేస్తోందనే వాదనలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు విబేధించడానికి ముందే ఈ విషయం ఆయనకు తెలుసునని, తన నాయకుల జోలికి రావద్దంటూ ఆయన కోరినా దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పై యుద్ధం ప్రకటించారని అంటున్నారు. తెలుగుదేశం నాయకుల అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసుకోవాలి కాని కేంద్ర ప్రభుత్వ సంస్ధలను నిషేధించడం, పైగా ఆ చర్యను సమర్ధించుకోవడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి అవినీతి, అక్రమాలను నిలువరించేందుకే సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కావాలని చంద్రబాబు నాయుడికి రాజకీయ విశ్లేషకులు, తెలుగు ప్రజలు హితవు పలుకుతున్నారు.