Begin typing your search above and press return to search.
ఏందీ.. తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు మాత్రమే తెలుసా కిషన్ రెడ్డి?
By: Tupaki Desk | 19 Feb 2020 4:50 AM GMTవామ్మో.. ఓల్లమ్మో.. ఈ మాటలేందే? అని గుండెలు బాదుకుంటూ తెలంగాణను ఇంత అవమానిస్తావా? అంటూ టీఆర్ఎస్ వర్గాలు విరుచుకుపడేందుకు సరిపోయే బందర్ లడ్డూ లాంటి వివాదాన్ని తన మాటలతో ఇచ్చేశారు కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ మీద తనకున్న అభిమానాన్ని మాటల్లో వర్ణించే క్రమంలో ఆయన టంగ్ స్లిప్ అయ్యింది. మోడీని పొగడటం తప్పేం కాదు. కానీ.. తెలంగాణ ప్రజల్ని తక్కువ చేసేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించేందుకు హైదరాబాద్ కు వచ్చారు కేంద్రమంత్రి పీయూష్ గోయిల్. ఈ సందర్భంగా ఆయన పాల్గొన్న కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆచితూచి అన్నట్లు మాట్లాడే అలవాటున్న ఆయన తొందరపడ్డారు. తెలంగాణ ఘన చరిత్రను గుర్తుకు తెచ్చుకునేలా ఇక్కడి ప్రజల్ని చిన్నబుచ్చేలా మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణ ప్రజలకు ఒకప్పుడు ఎర్రబస్సు మాత్రమే అలవాటు ఉండేదని.. రైల్వే సౌకర్యం ఉండేది కాదన్నారు. అలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం కొత్త రైల్వేలైన్ ప్రారంభించి సౌకర్యాల్ని కల్పించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణను నిర్లక్ష్యం చేశారని.. మోడీ సర్కారు వచ్చిన తర్వాత తెలంగాణ లో రైల్వే లైన్ల డెవలప్ మెంట్ పెరుగుతున్నట్లు గా పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల లో అదనంగా 48 కొత్త రైళ్లను ప్రారంభించారని.. 50 రైళ్లను పొడిగించారన్నారు. ఈ మాటలన్ని బాగానే ఉన్నా.. మధ్యలో చేర్చాల్సిన చిన్న మాటను మిస్ అయిన కిషన్ రెడ్డి విమర్శలకు చేతి నిండా అవకాశం ఇచ్చారు.
అప్పుడెప్పుడో నిజాం హయాంలోనే హైదరాబాద్ నుంచి రైళ్లు మొదలైనా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారన్న మాటను ప్రస్తావించి ఉంటే బాగుండేది. కిషన్ రెడ్డి మాటల్ని వింటే.. మోడీ వచ్చే వరకూ తెలంగాణ వారికి రైళ్లు అన్నవి తెలీదన్న అర్థం వచ్చేలా ఉండటం వివాదానికి మూలకారణంగా చెప్పాలి.
అలా అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదా? అంటే కొంతమేర ఉంది. కాకుంటే.. దాన్ని ఆయన చెప్పిన తీరులో దొర్లిన తప్పే ఆయనకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టిందని చెప్పాలి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ లో రైల్వే సదుపాయం తక్కువనే చెప్పాలి. పాత జిల్లాల లెక్కలో చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా రైళ్ల కనెక్టివిటీ తక్కువే. అయితే.. అప్పుడెప్పుడు 18వ శతాబ్దం చివర్లోనే నిజాం రాజులు రైల్వే లైన్ ను నిర్మించారు. కానీ.. తర్వాత మాత్రం దాన్ని విస్తరించే విషయం లో విపరీతమైన నిర్లక్ష్యం చోటు చేసుకుంది. దాన్ని మోడీ సర్కారు సరి చేసే ప్రయత్నం చేస్తోందన్నది కిషన్ రెడ్డి ఉద్దేశం కావొచ్చు. అయితే.. ఆ విషయాన్ని వివరంగా చెప్పే క్రమంలో పొరపాటు పడటం.. మొత్తం క్రెడిట్ మోడీ ఖాతాలో వేయాలన్న తపన కిషన్ రెడ్డికి కొత్త కష్టాలు తలెత్తేలా చేశాయని చెప్పకతప్పదు.