Begin typing your search above and press return to search.

తస్మాత్ జాగ్రత్త.. ఏ వయసు వారికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం

By:  Tupaki Desk   |   28 Oct 2020 12:50 PM GMT
తస్మాత్ జాగ్రత్త.. ఏ వయసు వారికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం
X
గుండె నుంచి రక్తం శరీరంలోని అన్నిభాగాలకు నాళాల ద్వారా సరఫరా అవుతుంది. సక్రమంగా రక్త సరఫరా జరిగినప్పుడు అన్ని భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. అయితే అప్పుడప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అలాంటప్పుడు ప్రాంతంలో రక్తం సక్రమం గా సరఫరా కాకుండా ఆ భాగాలు పని చేయవు. గుండె పరిసర ప్రాంతాల్లో అడ్డంకులు ఏర్పడితే వస్తే గుండెపోటు వస్తుంది. మెదడు వద్ద రక్తనాళాల్లో అ డ్డంకులు ఏర్పడితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎవరికైనా వ్యాధి వస్తుంది. అతిగా మద్యం తాగే వారికి పాతికేళ్లకే ఈవ్యాధి ప్రబలుతుంది. 50 ఏళ్ల వారికి వయసు ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది. ముందుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు కాళ్ల నొప్పుల ద్వారా బయటపడతాయి. కొంతదూరం నడిచినా పిక్కల్లో నొప్పి అన్పిస్తే బ్రెయిన్‌స్ట్రోక్‌ లక్షణంగా అనుమానించవచ్చు.

లక్షణాలు కన్పించిన మూడు గంటల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ గతంలో వాడుకభాషలో పక్షవాతం అనేవారు. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్ప డినప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాల వల్ల నీరసం ఆవహిస్తుంది, అంటే కాళ్లు, చేతుల్లో బలం తగ్గుతుంది. కొందరిలో మాటలు తడబడతాయి. నోరు వంకరగా పోతుంది. ఈ లక్షణాలు బ్రెయిన్‌స్ట్రోక్‌ను ధృవపరుస్తా యి. ఈ లక్షణా లు కన్పించిన మూడు గంటల వ్యవధిలో న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడానికి గల కారణాలు

మెదడులోని కొంత భాగానికి రక్తం సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడినప్పుడు, ఆ భాగంలోని మెదడు, కణాలు నిర్జీవం అవుతాయి. దానినే వైద్య పరిభాషలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటారు.బ్రెయిన్‌ స్ట్రోక్‌ కూడా గుండెపోటు లాగే అత్యవసర వైద్యస్థితి. సకాలంలో గుర్తించి వైద్యం అందిస్తే ప్రాణాపాయస్థితి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. స్ట్రోక్‌ రాకపోయినా, ఇక ముందు వస్తుందని గుర్తిస్తే నివారించడానికి వీలుండే అవకాశం ఉంది. అధిక రక్త పోటు, అధిక కొలెస్ట్రాల్‌, క్రమబద్ధంగా గుండె కొట్టుకోకపోవడం, గతంలో గుండె పోటువచ్చి ఉండి, మధుమేహం, స్థూలకాయం, సంతాన నిరోధక మాత్రలు వాడటం, అతిగా మద్యం తాగడం,అతి ధూమపానం స్ట్రోక్‌కు దారితీస్తాయి.

స్ట్రోక్‌ రాకుండా జాగ్రత్తలు

సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చే యాలి. అధిక బరువు తగ్గేందుకు తగు జాగ్రత్త లు తీసుకోవాలి, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి, , మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి.