Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ టెన్షన్ తో చచ్చిపోయిన శృంగాయ యావ

By:  Tupaki Desk   |   1 Jun 2020 3:00 PM GMT
లాక్ డౌన్ టెన్షన్ తో చచ్చిపోయిన శృంగాయ యావ
X
మనుసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కోరికలు కలుగుతాయి. సరిపడా ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే మూడ్ ఉంటుంది. ఇప్పుడా మూడ్ ప్రపంచవ్యాప్తంగా లేదు. ఎందుకంటే మహమ్మారి సోకి దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతున్నా ఉద్యోగాలు లేక జీతం రాక ఆర్థికంగా అందరూ అష్టకష్టాలు పడుతున్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో చాలా మందిలో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోందని లేటెస్ట్ సర్వే ఒకటి తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎదురవుతున్నట్టు తేలింది.

లాక్ డౌన్ టెన్షన్ తో సగానికంటే తక్కువమంది మాత్రమే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారని.. మిగిలిన వారిలోనూ లాక్ డౌన్ శృంగారపు ఆలోచనను చంపేసిందని బ్రిటన్ కు చెందిన అంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ , ఉల్ స్టర్ యూనివర్సిటీ సర్వేలో తేలింది.

బ్రిటన్ లో కరోనా సంక్షోభాల కారణంగా 40శాతంమంది వారంలో ఒకసారి మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. లాక్ డౌన్ ప్రభావం ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంపై భారీగా పడినట్టు కనిపిస్తోందన్నారు. శృంగారంపై ఆసక్తిని కలిగించే మూడ్ ను లాక్ డౌన్ కిల్ చేసినట్టు తేల్చారు. ఈ మేరకు 868 బ్రిటన్ వాసులపై సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించారు.

లాక్ డౌన్ తో అందరికీ విరామం దొరికి శృంగారం ఎక్కువ అవుతుందని ఊహించామని కానీ దానికి విరుద్ధంగా జరుగుతోందని సర్వే తేల్చింది. గత ఏడురోజుల్లో 39.9శాతం మాత్రమే సెక్స్ వల్ యాక్టివిటీలో పాల్గొన్నారని తేల్చారు.

ప్రస్తుతం చాలామందిలో కరోనా కారణంగా ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో వారిలో శృంగారంపై ఆసక్తి కోల్పోయినట్టు చెప్పారు.