Begin typing your search above and press return to search.
మా గ్రామంలోకి రావొద్దు ఆ వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం !
By: Tupaki Desk | 8 April 2021 11:10 AM GMTప్రస్తుతం ఏపీలో పరిషత్ ఎన్నికలకి ఓ ముగింపు రావడంతో అందరి చూపు తిరుపతి ఉప ఎన్నికపై పడింది. తిరుపతి లోక్ సభ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారంలో అందరూ హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే రుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం శ్రీకాళహస్తి మండలంలో ఎమ్మెల్యే రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం వాంపల్లెలో ప్రచారం నిర్వహించి పోలి గ్రామానికి వెళ్లేయత్నం చేశారట. అక్కడ ఎమ్మెల్యేకు ఘోర అవమానం ఎదురైందట. పలు అంశాలపై స్థానికులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను నిలదీశారట.
దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయకుండానే, అక్కడనుంచి వెళ్లిపోయారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. పోలి గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడని, తమ గ్రామంలో ప్రచారాని రాకూడదని, మా గ్రామానికి ఎలా వస్తావంటూ సవాల్ విసిరారని అంటున్నారు. ఈ సమయంలోనే పార్టీ నేతను గౌరవం లేకుండా మాట్లాడుతున్న నిన్ను బాగా గుర్తుంచుకుంటానని ఎమ్మెల్యే ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అనంతరం మధుసూదనరెడ్డి సమాచారంతో శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సునీల్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారట. ఆ తర్వాత పల్లంపేటలోనూ ఎమ్మెల్యేకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఓ వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారట. దీనిపై పలువురు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడా ఆయన ప్రచారం చేయకుండా వెనుదిరగాల్సి వచ్చిందట.