Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి అహంకారం

By:  Tupaki Desk   |   2 Jun 2018 6:55 AM GMT
కేంద్ర మంత్రి అహంకారం
X
ఎంత తెలివైన నియంత‌లైనా మ‌ట్టి క‌ర‌వ‌క త‌ప్ప‌లేదు. అది చ‌రిత్ర చెప్పిన స‌త్యం. హిట్ల‌ర్ తెలివైన‌వాడు - విద్యావంతుడు - మాట‌కారి. చివ‌ర‌కు ఒక బంక‌ర్‌ లో దాక్కుని కాలం గ‌డిపారు. ఇలాంటి సాక్ష్యాలెన్నో చ‌రిత్ర‌లో ఉన్నాయి. విర్ర‌వీగిన వారంద‌రూ మ‌ట్టిలో క‌లిసిపోయారు. జ‌న రంజ‌క పాల‌న అందించిన వారే ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచి చ‌రిత్ర‌లో నిల‌బ‌డ్డారు.

2014లో మోడీ ప్ర‌భంజ‌నం నిజ‌మే. కానీ అది మోడీ తెలివి ఒక్క‌టే కాదు. కాంగ్రెస్ వైఫ‌ల్యం - మ‌న్మోహ‌న్ మౌనం. సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం - మోడీ మాట‌కారిత‌నం. గ‌త రెండు ద‌శాబ్దాలుగా జాతీయ రాజ‌కీయాల్లో మాట‌ల గార‌డీ నేర్చిన నాయ‌కుడే లేరు. దీంతో క‌లిసొచ్చిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో మోడీ మాట‌లు మ‌రింత బ‌లంగా ప‌నిచేశాయి. ఎపుడైతే అప్ర‌తిహ‌తంగా నిక్క‌మైన మెజారిటీతో గెలిచాడో మోడీలో విజ‌య‌గ‌ర్వం మొద‌లైంది. తానే ఒక బ్రాండ్‌ గా ఫీల‌య్యాడు. కానీ మోడీకి అర్థం కాని నిజం ఏంటంటే... జ‌నానికి తెలివైన పాల‌కుడి కంటే విన‌యంగా ఉండే పాల‌కుడే న‌చ్చుతాడు. ఆ ఒక్క‌టీ మోడీలో మిస్. అందుకే అత్యంత స్వ‌ల్ప‌కాలంలోనే మోడీ ప‌త‌నం మొద‌లైంది. ప్ర‌తి మాట‌లో అహంకారం - బెదిరింపు - దేశం పేరిట అసంపూర్ణ నిర్ణ‌యాలు తీసుకుని సామాన్యుడిని ఇర‌కాటం పెట్ట‌డం వంటి వాటితో పాటు ఇత‌ర పార్టీలను - నేత‌ల‌ను పూచిక పుల్ల‌లా తీసేయ‌డం జ‌నానికి న‌చ్చ‌లేదు. ప్ర‌జాస్వామ్య దేశంలో జ‌నాలు ప్రేమ‌తో మాత్ర‌మే ఓట్లేయ‌రు... ఒక్కోసారి మార్పు కోసం కూడా వేస్తారు. అలా మార్పు కోసం ప‌డిన ఓట్లు ఎపుడూ మోడీ త‌న‌తో ఉంటాయ‌ని భ్ర‌మించాడు. వ్యూహాల‌తో గెలిచిన రాష్ట్రాల‌ను త‌న నిర్ణ‌యాల వ‌ల్ల వ‌చ్చిన గెలుపుగా భావించాడు. అందుకే ఈ స్థాయిలో మోడీ ప్ర‌భ త‌గ్గిపోతూ వ‌స్తోంది. ఉప ఎన్నిక‌ల్లో - అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓడిపోతూనే వ‌స్తోంది.

తాజాగా మోడీని మించిన అహంకారం ఆయ‌న కేబినెట్ మంత్రిలో కూడా క‌న‌ప‌డింది. ఆయ‌నెవ‌రో కాదు ఆరెస్సెస్ ర‌క్త‌మైన నితిన్ గ‌డ్క‌రీ. పుణెలో మీడియాతో మాట్లాడిన నితిన్ గ‌డ్క‌రీ జ‌నం క‌డుపు మండేలా మాట్లాడారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే... *ఎందుకు ఓ పెట్రోలు పెట్రోలు అని ఏడుస్తారు. పెట్రోలు లేక‌పోతే బ‌త‌క‌లేరా? ప‌్ర‌త్యామ్నాయ ర‌వాణా - ప్ర‌త్యామ్నాయ‌ ఇంధ‌నాలు వాడండి - ఎల‌క్ట్రిక్ కార్లు వ‌చ్చాయి. ఎందుకు గ‌గ్గోలు పెడ‌తారు* అని గ‌ద్దించారు.

అంటే మంత్రి గారు ఇపుడు మా కార్లు బైకులు అమ్మేసి బ‌స్సులెక్కాలి. లేక‌పోతే ఎల‌క్ట్రిక్ బైకులు - కార్లు కొనుక్కోవాలి. అంతేగాని పెట్రోలు ధ‌ర‌లు మాత్రం త‌గ్గించరు మీరు. పెట్రోలు పై అడ్డ‌దిడ్డంగా ఎక్సైజ్ సుంకం వేసి మీకు ఓట్లేసే వాళ్ల‌కు ఉచిత ప‌థ‌కాలు ఇస్తారు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాడు ఏమైపోయినా ప‌ర్లేదు మీకు అంటూ సామాన్యులు గ‌డ్క‌రీకి కౌంట‌ర్లు వేస్తున్నారు. ఈ మాత్రం దానికి మీకెందుకు సార్ అధికారం అని కొంద‌రు ప్రశ్నిస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన మంత్రిగా ఉండి జ‌నం ఇచ్చిన అధికారాన్ని చేత‌బ‌ట్టి జ‌నాన్నే గ‌ద్దించే మీ స‌హ‌నానికి జోహార్లు అంటూ ఇంకొంద‌రు కామెంట్ చేశారు. అయినా అంద‌రూ బైకులు కార్లు అమ్మేస్తే కొనేవారు ఎవ‌రు సార్ అని కొన్ని కామెంట్లు వచ్చాయి. మొత్తానికి మోడీ యే కాదు మోడీ బ్యాచ్ మొత్తానికి అహంకారం త‌ల‌కు ప‌ట్టేసింది. మీకెందుకండీ శ్ర‌మ ఏడాది ఆగండి రెస్ట్ ఇస్తాం అంటారేమో మోడీ జాగ్ర‌త్త‌!