Begin typing your search above and press return to search.

భారత్ లో జనాభా పెరగటానికి అమీర్ ఖాన్ లాంటి వారే కారణం: బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   12 July 2021 2:30 PM GMT
భారత్ లో జనాభా పెరగటానికి అమీర్ ఖాన్ లాంటి వారే కారణం: బీజేపీ ఎంపీ
X
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ లో జనాభా పెరగటానికి అమీర్ ఖాన్ లాంటి వారే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు. దానికి కారణాలు వెల్లడించారు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లల్ని కని.. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో భార్యగా కిరణ్ రావును వివాహం చేసుకొని ఆమెతో ఓ బిడ్డను కని ఇప్పుడు మూడో భార్య కోసం అమీర్ వెతుకుతున్నారని ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం ఇదేనా? అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో జనాభా అసమానతలకు అమీర్ ఖాన్ లాంటి వారే కారణం అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే అమీర్ ఖాన్ తన రెండో భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎంపీ సుధీర్ గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు.

అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనాతో ఇద్దరు పిల్లలను కన్నారని.. రెండో భార్య కిరణ్ తో ఒక సంతానం ఉందని.. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని బీజేపీ ఎంపీ సుధీర్ విమర్శించారు. దేశంలో జనాభా అసమానతలకు అమీర్ ఖాన్ లాంటి వారే కారణం కావడం దురదృష్టకరమన్నారు.

దేశ విభజన సమయంలో ఎక్కువ భూభాగం, తక్కువ జనాభాతో పాకిస్తాన్ ఏర్పాటైందని సుధీర్ గుర్తు చేశారు. కాబట్టి జనాభా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గత పదేళ్లలో భారత భూభాగం పెరగకపోయినా.. జనాభా మాత్రం పెరిగిపోయిందన్నారు. అది దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు.

ఇక అమీర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఓ బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నట్టు టాక్. ఇప్పటికే 15 ఏళ్లు కాపురం చేసి తొలి భార్య రీనాకు అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చాడు. వారికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇక రెండో భార్య కిరణ్ రావును వివాహం చేసుకొని ఆజాద్ రావు ఖాన్ అనే బిడ్డను కన్నారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.