Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ కు నజరానా ఇచ్చేస్తున్న సామాన్యులు

By:  Tupaki Desk   |   7 Dec 2019 10:58 AM IST
ఎన్ కౌంటర్ కు నజరానా ఇచ్చేస్తున్న సామాన్యులు
X
దిశ నిందితుల ఎన్ కౌంటర్ రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. సామాన్యలకు జరిగే అన్యాయాలకు న్యాయం జరిగే విషయంలో అవుతున్న ఆలస్యం.. నిందితులకు శిక్ష పడుతున్న వైనంపై తమలోని నిరసన కలగలిపి తాజా ఉదంతంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ చూడనటువంటి రీతిలో ఎన్ కౌంటర్ పై సామాన్యుల స్పందన భారీగా ఉంది.

దిశ ఎన్ కౌంటర్ విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే గుజరాత్ కు చెందిన భావ్ నగర్ వ్యాపారి రాజ్ భా గోహిల్ రూ.లక్ష నజరానాను తెలంగాణ పోలీసు సంక్షేమ నిధికి అందజేశారు. ఇదో సంచలంగా మారితే.. దీనికి కొనసాగింపుగా మరో భారీ విరాళం తెర మీదకు వచ్చింది.

హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన పిజ్జాబీన్ షాపు యజమాని ఏకంగా రూ.5లక్షల విరాళాన్ని ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులకు ఈ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు పోలీసులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ బహుమానాన్ని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. ఎన్ కౌంటర్ కు సామాన్యుల నుంచి వస్తున్న స్పందన ఇప్పుడు సంచలనంగా మారుతోంది.