Begin typing your search above and press return to search.
నోటి దురుసు మూల్యం..... వైసీపీ ఎమ్మెల్యే కు షాక్
By: Tupaki Desk | 10 Feb 2021 6:30 AM GMTనోరుపారేసుకోవటం అన్ని సందర్భాల్లో ఆశించినంత ఫలితాన్ని ఇవ్వదు. ఆ విషయాన్ని మర్చిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యవహరించిన తీరు.. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాన్ని వచ్చేలా చేసింది. చేతిలో ఉన్న అధికారాన్ని ఎక్కువగా ఊహించుకొని.. తామేం అన్నా.. ఏం చేసినా ఫర్లేదన్నట్లుగా వ్యవహరించిన తీరు పంచాయితీ ఎన్నికల్లో దెబ్బ తీసింది. ఇందుకు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు ఉదంతమే నిదర్శనంగా చెప్పాలి.
తన నియోజకవర్గ పరిధిలోని పంచాయితీలను కైవశం చేసుకోవటానికి ఆయన తన నోటి దురుసుతనాన్ని అస్త్రంగా సంధించారు. దీంతో.. తిరుగుబాటు అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలోకి దిగటంతో పార్టీ పలు పంచాయితీల్ని కోల్పోవాల్సి వచ్చింది. నియోజకవర్గంలో అత్యధిక పంచాయితీల్ని గెలుచుకున్నప్పటికి.. కొన్నిచోట్ల ఓటమిపాలు కావటానికి కారణం ఎమ్మెల్యే వైఖరనే చెబుతున్నారు. ఎన్నికల వేళలో.. అందరి మనసు దోచుకునేలా చేయటం.. మాట వినని వారిని మెత్తగా కౌన్సిలింగ్ చేయాల్సిన ఎమ్మెల్యే.. అందుకు భిన్నంగా వ్యవహరించారు.
దీంతో.. తమ సత్తా ఏమిటో చాటాలని డిసైడ్ అయిన వైరి వర్గం.. ఎమ్మెల్యేకు షాకివ్వాలని బలంగా ప్రయత్నించారు. రాజకోడూరుకు వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు.. అక్కడ తాను సూచించిన వ్యక్తినే సర్పంచ్ గా గెలిపించాలని.. ప్రత్యర్థి గెలిచినా పంచాయితీ కుర్చీలో కూర్చోనివ్వనని పేర్కొన్నారు. అదే తరహాలో వెల్చూరు పంచాయితీ వీఆర్ ఆగ్రహారంలో వార్నింగ్ ఇచ్చారు. ఈ రెండు చోట్ల కన్నబాబు వైరి వర్గం విజయం సాధించటం గమనార్హం.
రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు విజయం సాధించటంతో కన్నబాబుకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన పరిస్థితి. వెల్చూరులోనూ అలాంటి పరిస్థితే. ఇలాంటి పరిస్థితే పలుచోట్ల ఉంది. ఇదంతా కన్నబాబు నోటి దురుసుతో చేతులారా చేసుకున్నదన్న మాట వినిపిస్తోంది.