Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో పై నెటిజెన్స్ ఫైర్ ..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   5 March 2020 5:35 AM GMT
హైదరాబాద్ మెట్రో పై నెటిజెన్స్  ఫైర్ ..ఏమైందంటే ?
X
కరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద మహమ్మారి.చైనాలోని వూహన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ , కొద్దిగా కొద్దిగా విస్తరిస్తూ ...ఇప్పుడు ప్రపంచంలోని 80 కి పైగా దేశాలలో తన ప్రభావాన్ని చూపిస్తుంది. దీనితో ప్రజలందరూ ఎక్కడ కరోనా భారిన పెడతామో అని భయం భయంగా గడుపుతున్నారు. అలాగే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా జంకుతున్నారు. ప్రతి ఒక్కరూ నోటికి మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నాయి. కరోనా సోకకుండా, సోకితే... అనే అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.

అయితే , ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో తీసుకున్న కొన్ని చర్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ సిటీలో ఉందన్న ప్రచారంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు ...మెట్రో రైళ్లని , స్టేషన్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ...మేము కరోనా రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా పెట్టింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు హైదరాబాద్ మెట్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్ వంటి రక్షణాత్మక వస్తువులు లేకుండా మెట్రో ఉద్యోగులు ఎలివేటర్, ట్రెయిన్ కోచ్, మెట్రో స్టేషన్స్ లోని బెంచీలను క్లీన్ చేస్తున్నారని, దీంతో ఒకవేళ కరోనా వైరస్ ఉంటే వారికి కూడా అంటుకుంటుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అలాగే, ఆ ఉద్యోగులు క్లీన్ చేస్తున్న క్లాత్ కూడా సాధారణంగా మనం ఉపయోగించేది. దీనిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.ఒకవేళ ఏదైనా కరోనా ఉన్న ప్రాంతంలో ఆ క్లాత్‌తో క్లీన్ చేసి, మరోచోట దాంతోనే శుభ్రపరిస్తే అక్కడకు కరోనా చేరుకునే అవకాశం ఉంటుందని, ఎదో మేమే శుభ్రం చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకునే కంటే ...ఆ పని చేయకుండా ఉన్నా మంచిదే అంటూ మెట్రో పై మండిపడుతున్నారు. మొదట క్లీన్ చేస్తున్న వర్కర్స్‌ కు శానిటేషన్, ప్రొటెక్టివ్ కిట్స్ ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో అధికారులకి సూచనలు ఇస్తున్నారు. చూడాలి మరి ఇకనైనా మెట్రో అధికారులు తమ తీరుని మార్చుకుంటారో లేదో