Begin typing your search above and press return to search.
మజ్లిస్ కోటలో అసద్ కు చేదు అనుభవం
By: Tupaki Desk | 23 Nov 2020 11:10 AM GMTమజ్లిస్ అడ్డాలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎంతటి గ్రాండ్ వెల్ కం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మహారాజు స్వయంగా వస్తే.. ఆ దేశ ప్రజలు ఎంతలా సంతోషడిపోతారో.. పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో అసద్ రావటాన్ని అంతలా సంతోషపడుతుంటారు. అలా అని.. అసద్ పై వ్యతిరేకత లేదా అంటే.. ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువగా ఉండదు. ఎన్నికల వేళ.. అసద్ ప్రచారం భిన్నంగా సాగుతుంటుంది. మీడియాకు పెద్దగా సమాచారం ఇవ్వరు. గుట్టుగా తన వంతు ప్రచారం చేసుకుంటూ పోతారు.
ఇప్పటివరకు ఆయనకు ఎదురన్నదే లేనట్లుగా సాగే తీరుకు భిన్నంగా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. మజ్లిస్ కు పట్టు ఉన్న జాంబాగ్ డివిజన్ లో ఈ రోజు అసద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడున్న ప్రజల నుంచి ఆయనకు అనుకోని అనుభవం ఎదురైంది. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని.. ఎన్నికల వేళ ఎలా ఓట్లు అడుగుతారని స్థానిక మహిళలు ప్రశ్నించారు.
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల ప్రచారానికి మాత్రం వస్తున్నారని.. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఓట్లు అడగటానికి వస్తున్నారా? అని ప్రశ్నించారు. ఓట్లు అడగటానికి వస్తున్న వారు.. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రశ్నల వర్షాన్నిఊహించని అసద్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీంతో.. ఆయన మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో అసద్ కు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెబుతున్నారు.