Begin typing your search above and press return to search.
విశాఖను ప్రజలు రాజధానిగా కోరడం లేదు.. : బీజేపీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 19 March 2023 8:14 AM GMTవిశాఖను పాలనా రాజధానిగా మారుస్తామంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనను ఇక్కడి ప్రజలు స్వాగతించడం లేదేని.. ఈ విషయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఇక్కడి విద్యావంతులు స్పష్టం చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ పార్టీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. తాజాగా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ-బీజేపీ రెండు పార్టీలూ కలిసిపోయాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ... వైసీపీ, బీజేపీ దొందూ దొందే అని భావిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ ఫొటోలు తీసుకోవడం చూసి.. వైసీపీ, బీజేపీ ఒకటే అనుకుంటున్నారని పేర్కొన్నారు. విశాఖను పాలన రాజధాని అనడం ప్రజలకు ఇష్టం లేదని, అందుకే వైసీపీని ఓడించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి శుభపరిణామమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని విష్ణు కుమార్ రాజు ఆకాంక్షించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ తక్కువ ఓట్లు వచ్చాయి. కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. కేవలం 10,820 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ దక్కించుకోవాలంటే 30 వేల పైచిలుకు ఓట్లు రావాల్సి ఉంది. ఇక, అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ కూడా.. చేతులు ఎత్తేశారు. ఆయనకు కేవలం 57 వేల ఓట్లు వచ్చి డిపాజిట్ దక్కించుకున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. విశాఖను రాజధాని చేస్తామన్నాం కాబట్టి ఇక్కడి ప్రజలుత మకు పట్టం కడతారని అనుకున్నా.. అది సాధ్యం కాకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.