Begin typing your search above and press return to search.
సగం యూనిఫాంతో పారిపోతున్న ఎస్ఐను పట్టుకున్న ప్రజలు
By: Tupaki Desk | 5 Nov 2021 1:51 PM GMTదొంగను పట్టుకోవటానికి పోలీసులు పరుగులు తీస్తుంటారు. తాజా ఉదంతంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది. పారిపోయేందుకు పరుగులు తీస్తున్న ఎస్ఐను ప్రజలు వెంబడించి మరీ పట్టేసుకున్న అరుదైన ఉదంతం తాజాగా కర్ణాటకలోని తమకూరులో చోటు చేసుకుంది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
ఒక ఎస్ఐ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. గుబ్బిన్ తాలూకాలోని చంద్రశేఖర్ పొరా పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రశేఖర్ పొరా పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక కేసులో భాగంగా చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. దాన్ని విడిచి పెట్టేందుకు రూ.28వేల లంచాన్ని ఇవ్వాల్సిందేనని ఎస్ ఐ సోమశేఖర్ తేల్చారు. ఆ మొత్తాన్ని కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్ వసూలు చేయాలని ఆదేశించాడు.
ఇదిలా ఉంటే బాధితుడు ఎసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. ఎస్ఐను ట్రాప్ చేసి పట్టుకునేందుకు వల పన్నారు. ఇందులో భాగంగా బాధితుడి నుంచి కానిస్టేబుల్ రూ.12వేలు తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే.. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని.. ఆ మొత్తాన్ని ఎస్ఐ తీసుకురావాలని చెప్పటంతో తాను తీసుకున్న విషయాన్ని కానిస్టేబుల్ చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ ను తీసుకొని స్టేషన్ కు వెళ్లారు.
తన అవినీతి వ్యవహారం బయటకు వెల్లడైందన్న విషయాన్ని గుర్తించిన సదరు ఎస్ఐ.. తన యూనిఫాం చొక్కాను అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేసి.. స్టేషన్ నుంచి బయటకు వచ్చి పరుగు తీశారు. ఆ విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు ఎస్ఐను పట్టుకునేందుకు అతని వెనుక పరుగులు తీశారు. సకాలంలో స్థానికులు స్పందించి.. సగం దుస్తులతో ఉన్న ఎస్ఐను పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. కేసు గురించి విన్న న్యాయమూర్తి.. సదరు ఎస్ఐను 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దొంగల్ని పట్టుకునే పోలీసుల్ని రివర్సు గేరులో చేధించి పట్టుకున్న వైనం స్థానంగా సంచలనంగా మారింది.