Begin typing your search above and press return to search.

కరోనాతో మానసిక ఒత్తిడి.. శృంగారానికి దూరం

By:  Tupaki Desk   |   30 July 2020 12:30 AM GMT
కరోనాతో మానసిక ఒత్తిడి.. శృంగారానికి దూరం
X
స్వేచ్ఛగా విహరించే పక్షులు, జంతువులను ఒక పంజరంలో బంధిస్తే ఏమవుతుంది. వాటి శక్తి సామర్థ్యాలన్నీ కోల్పోయి స్తబ్దుగా ఉండిపోతాయి. ఇప్పుడు మనిషి కూడా అంతే.. దేశాలకు దేశాలు విహరిస్తూ పర్యటకాన్ని అనుభవిస్తూ.. బయట తిరుగుతూ అస్వాదించే వ్యక్తులంతా ఇంట్లోనే కరోనా లాక్ డౌన్ తో బందీ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నట్టు తెలిసింది.

సమాజంలోకి మనిషి ఎంట్రీ ఇస్తేనే కాస్త మానసిక ప్రశాంతత ఉంటుంది. అది ఆఫీసైనా.. లేదా మరే చోటకు అయినా బయటకు వెళ్తేనే సేదతీరినట్టు అవుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో కరోనా భయంతో అందరూ ఇంటికే పరిమితం కావడంతో శృంగారం మీద కూడా ఎఫెక్ట్ పడుతోందని తేలింది.

మనిషిని ఒత్తిడి నుంచి బయటపడేసేది శృంగారం. శృంగారం సమయంలో రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్ హార్మోన్ మనిషిలో ఉన్న ఒత్తిడిని దూరం చేస్తుంది. శృంగారంతో మనిషి ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండేందుకు ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది.

అయితే నిత్యం సమస్యలతో బిజీగా ఉన్నప్పటికీ అందరూ ఇంటికి రాగానే నెలలో కొన్ని రోజులైనా శృంగారంతో సేదతీరేవారు. కానీ ఇప్పుడు కరోనాతో వర్క్ ఫ్రం హోంలో 24 గంటలూ ఇంట్లోనే ఉండడంతో శృంగారంపై ఆసక్తిని కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి.

ఇంటికే పరిమితం కావడంతో భార్యభర్తల మధ్య సఖ్యత లోపించడం ఒక కారణమైతే.. దగ్గరగా ఉంటే కరోనా భయంతోనూ శృంగారంలో పాల్గొనడం లేదట.. ఇక ప్రేమికులు అయితే స్వేచ్ఛగా విహరించి ఇప్పుడు బందీ అయిపోవడంతో తీవ్రంగా మానసిక క్షోభకు గురి అవుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మనసికంగా ఒత్తిడి పెంచుతోందని.. శృంగారంపై ఆసక్తిని చంపేస్తోందని తేలింది.