Begin typing your search above and press return to search.

బీజేపీలోకి జనాలు మరిచిన నేతలు

By:  Tupaki Desk   |   16 Aug 2020 5:00 AM IST
బీజేపీలోకి జనాలు మరిచిన నేతలు
X
తమిళనాట బలపడాలని చూస్తున్న బీజేపీ.. అక్కడ జనాలు మరిచిపోయిన నేతలను తెరపైకి తీసుకొస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వరుసగా తమిళనాట అప్పుడెప్పుడో వెలుగు వెలిగి కనుమరుగైన వారి వారసులు తెరపైకి వస్తున్నారు.

మొన్న గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురును చేర్చుకున్న కమలదళం.. ఇప్పుడు పెరియార్ మనవడని బీజేపీలోకి ఆహ్వానించింది. వీళ్లంతా గొప్పగొప్ప వాళ్ల వారసులు కావడం విశేషం. చూస్తుంటే మరిచిపోయిన వారసులకు తమిళనాట పుంజుకోలేకపోతున్న బీజేపీ పెద్ద పీట వేస్తున్నట్టుగా పరిస్థితి ఉంది.

నిజానికి బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధమైన మనషులను ఆ పార్టీ చేర్చుకుంటుండడమే ఇక్కడ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తమిళనాట పెరియర్ సిద్ధాంతమే నాస్తికవాదం.. విగ్రహారాధనకు వ్యతిరేకం. బీజేపీకి ఫక్తు వ్యతిరేక స్వభావం.. కానీ వారినే ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో అక్కున చేర్చుకుంటోంది.

తమిళనాట ఇప్పుడు అన్నాడీఎంకే, డీఎంకేల హవా నడుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీ బలపడడం లేదు. ఈ పార్టీకి పెద్దనేతలు ఎవరూ రావడం లేదు. దీంతో దిగ్గజాల వారసులను పిలుస్తూ ప్రస్తుతానికి రాజకీయం నడిపిస్తోంది.