Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ అప్పు.. తీసుకుంటే ప్రాణాలకు ముప్పు?
By: Tupaki Desk | 18 Dec 2020 6:09 AM GMTకరోనా కష్టకాలం.. చేతిలో రూపాయి లేని పరిస్థితి. ఉద్యోగ, ఉపాధి దూరమైంది. అందుకే అందరూ ఇప్పుడు ఫోన్ లోని యాప్స్ లో అప్పు ఇస్తామనగానే తీసుకుంటున్నారు. ఈ ఆన్ లైన్ అప్పుయే తర్వాత వారి ప్రాణాలకు ముప్పుగా పరిగణిస్తోంది. ఏ డ్యాక్యుమెంట్స్ అవసరం లేకుండానే అప్పు ఇస్తామని ఊరిస్తున్న యాప్స్ , కంపెనీలో మాయలో పడి అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్న దారుణమైన సంఘటనలు తాజాగా వరుసగా చోటుచేసుకుంటున్నాయి.
వద్దన్నా ఇప్పుడు ఆన్ లైన్ యాప్ లు, కంపెనీలు వెంటపడి మరీ అప్పులు ఇస్తున్నాయి. కాస్త లేటైతే ఇంటికొచ్చి వేధిస్తున్నాయి. స్నేహితులు, బంధువులకు తెలిపి పరువు తీస్తున్నాయి. చివరకు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
బ్యాంకులు.. వడ్డీ వ్యాపారుల చుటూ తిరగకుండానే ఆన్ లైన్లోనే డబ్బులు అప్పుగా ఇస్తుండటంతో చాలామంది వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడంతో వాళ్ల ఆదాయం తగ్గింది. దీంతో యాప్ ల మాయలో పడిపోతున్నారు.
ఇటీవల సిద్దిపేట కు చెందిన యువతి ఓ ఆన్ లైన్ యాప్లో ఇన్‌స్టంట్ లోన్ తీసుకొని డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేసింది. దీంతో ఆ యాప్ నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
ఈ సంఘటన మరువక ముందే హైదరాబాద్లోనూ ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగుచూసింది. రాజేందర్ నగర్ కిస్మాత్ పూర్ కు చెందిన ఓవ్యక్తి సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనాతో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఓ ఆన్ లైన్ యాప్లో ఇన్ స్టంట్ లోన్ తీసుకున్నాడు.లోన్ కట్టడం ఆలస్యమైంది. దీంతో సదరు యాప్ నిర్వాహాకులు యువకుడి అమ్మకు సైతం ఫోన్ చేసి వేధించారు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నాడు.
బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలంటే చాలా కష్టం.. అందుకని.. చాలామంది ఈ యాప్‌ల మాయలో పడిపోతున్నారు. తిరిగి చెల్లించేటప్పుడు మానసిక హింసకు గురవడం..వడ్డీ ఎక్కువ వసూలు చేస్తుడడంతో అప్పులు తీర్చే మార్గం లేక తనువు చాలిస్తున్నారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా భారీ వడ్డికి నెల, 15 రోజుల చొప్పున అప్పులు ఇచ్చి ప్రజల ఊసురు తీస్తున్నాయి. హిమాయత్ నగర్ కు చెందిన లక్ష్మణ్ 30వేలు లోన్ తీసుకొని ఆలస్యమైన పాపానికి లక్షన్నర వసూలు చేశారు. అయినా వదలకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ యాప్ ల్లో చాలా సంస్థలు చైనాకు చెందినవే.. వాటిని సంప్రదించాలన్నా.. వాటికి సంబంధించిన వెబ్ సైట్లు, కాంటాక్ట్ యాప్ గురించి తెలుసుకుందామన్నా దొరకవు. చైనాలో సర్వర్లు ఉంటాయి. వీటికి ఆర్బీఐ గుర్తింపు ఉండదు. దీంతో ఆన్ లైన్ లో విచ్చలవిడిగా ఆఫర్లు ఇస్తూ అప్పులు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నాయి.