Begin typing your search above and press return to search.
హిందీని 'పెరుగు' రూపంలో రుద్దుతున్నారా?: తమిళనాడు, కర్ణాటకల్లో మంటలు!
By: Tupaki Desk | 30 March 2023 10:50 AM GMTప్రాంతీయ భాషలు వర్థిల్లాలని.. గత ప్రభుత్వాలు ప్రాంతీయ భాషలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశాయని.. దీంతో దేశంలో గ్రామీణ, పేద విద్యార్థులు.. ఉన్నత విద్యలకు దూరంగా ఉండిపోయారని.. ఈ పాపం కాంగ్రెస్‌దేనని.. రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటకలో పర్యటించిన సందర్భం గా.. కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. అదేసమయంలో ఆయన.. తాము ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
అంతేకాదు.. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యల్లో కూడా స్థానిక భాషకు పట్టం కడుతున్నామని.. చెప్పారు. ఒక్కసారి ఇక్కడ కట్ చేద్దాం.. మరి స్థానిక భాషలకు ఇంతగా పట్టం కడుతున్న ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నోటితో చెబుతున్నట్టుగా చేతల్లో చేస్తోందా? అంటే లేదనే చెప్పాలి. భారతీయ భాషగా హిందీని అందరూ చదవాలని, మాట్లాడాలనే ఒత్తిడి తెస్తోంది. అంతేకాదు.. దీనికి ఎంత వ్యతిరేకవ చ్చినా. మొండిగా ముందుకే సాగుతోంది.
తాజాగా.. ప్రజలకు విక్రయించే పాలు, పెరుగు ప్యాకెట్లపై హిందీ పేర్లు ముద్రించాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎప్ ఏఎస్ ఎస్ ఐ) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. అమల్లో పెట్టాలని కొరడా కూడా ఝళిపించింది.
దీంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో పంపిణీ అవుతున్న నందినీ పాల ఉత్పత్తులపై దూద్, దహీ అంటూ.. పేర్లను ముద్రించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా.. స్థానిక భాషలకు ప్రాణం పెట్టే.. తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఈ దొడ్డిదారి వ్యవహారాన్ని గుర్తించారు.
హిందీని బలంవతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని.. కర్ణాటక ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. అదేసమయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. ఏకంగా సీఎం స్టాలిన్ దీనిపై రియాక్ట్ అయ్యారు.
ఇదంతా .. కేంద్రం చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు.. హిందీని ఇలా రుద్దాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇక, ఈ పెరుగు, పాల ప్యాకెట్లపై హిందీలో ఉన్న దూద్, దహీ పేర్లను పెద్దవిగాను.. పక్కనే బ్రాకెట్లలో స్థానిక భాషలో చిన్నవి గానూ ముద్రించారు. ఇదీ.. మోడీ వారి భాషాభిమానం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.