Begin typing your search above and press return to search.

రికార్డు..సింగపూర్ అధికారపక్షానికే సొంతమేమో

By:  Tupaki Desk   |   13 Sep 2015 9:07 AM GMT
రికార్డు..సింగపూర్ అధికారపక్షానికే సొంతమేమో
X
ఒకసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటేమ గొప్పగా భావిస్తారు. అలాంటి వరుసగా మూడుసార్లు సాధిస్తే.. తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తారు. కానీ.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మాత్రం వ్యతిరేకత పెరిగిపోయి.. అధికార బదిలీ జరిగిపోవటం ఖాయం.

ఇలాంటివి ప్రపంచంలో మరెక్కడైనా జరుగుతాయేమో కానీ.. సింగపూర్ లో మాత్రం జరగదు. ఎందుకంటే.. ఆ దేశంలో 12 సార్లు వరుసగా అధికారపీఠాన్ని కైవశం చేసుకుంది పీపుల్స్ యాక్షన్ పార్టీ. సింగపూర్ దేశానికి స్వాతంత్ర్యం లభించిన 1965 నుంచి తాజాగా నిర్వహించిన ఎన్నికల్ల వరకూ అధికారపక్ష హవానే నడుస్తుంది.

వరుసగా ఒకే పార్టీ అధికారంలో ఉండటం అరుదైన అంశమే కాదు.. ఇంత సుదీర్ఘ కాలం పాటు కొనసాగటం చిన్న విషయం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు.. విమర్శలు ఖాయం. అలాంటిది దాదాపు యాభై సంవత్సరాలుగా ఓకే పార్టీని సింగపూర్ దేశ వాసులు అధికారం కట్టబెడుతున్నారంటే.. పీపుల్స్ యాక్షన్ పార్టీ సత్తా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా ముగిసిన ఎన్నికల ఫలితాలు విడుదలై.. అధికారపక్షం ఘన విజయం సాధించింది. పార్లమెంటులో మొత్తం 89 సీట్లు ఉంటే.. అధికార పీఏపీ 83 స్థానాల్ని సొంతం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత ఎన్నికల్లో పోలిస్తే.. మరో స్థానం అదనంగా అధికారపార్టీకి లభించింది. ఇలాంటి విచిత్రమైన రికార్డు.. సింగపూర్ అధికారపక్షానికే సొంతమేమో. తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ 69.9 శాతం ఓట్లను సొంతం చేసుకోవటం విశేషంగా చెప్పకతప్పదు.