Begin typing your search above and press return to search.
పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
By: Tupaki Desk | 3 Sep 2020 7:32 AM GMTపశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు ( అలియాస్ చినబాబు) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన గురువారం కన్నుమూశారు. ఆయన మృతితో పెనుగొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. చినబాబు ఇక లేరన్న వార్త తెలియడంతో కుటుంబ సభ్యులతో పాటు, స్థానిక వైసీపీ కార్యకర్తల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
1999లో పెనుగొండ అసెంబ్లీ నుంచి స్వతంత్య అభ్యర్థిగా చినబాబు గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ , పార్టీ నుండి టికెట్ దక్కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరిన చినబాబు.. 2014లో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఆచంట నియోజవర్గం కన్వీనర్ గా చినబాబు పనిచేశారు. కూనపరెడ్డి మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు ప్రగాఢ సంతాపం తెలియజేసారు.