Begin typing your search above and press return to search.
కరోనా తర్వాత జరిగిన తొలి టోర్నీలో తెలుగోడు చెలరేగిపోయాడు
By: Tupaki Desk | 20 July 2020 4:39 PM GMTకరోనా ప్రభావం యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. అంతేనా.. వివిధ రంగాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వ్యాపారమే కాదు.. క్రీడలు.. వినోదాలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని.. సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తే.. అమెరికా లాంటి అగ్రదేశాల్లో లాక్ డౌన్ ను లైట్ తీసుకున్న దానికి ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో చూస్తున్నదే. కరోనా నేపథ్యంలో క్రీడా టోర్నీల్ని నిలిపివేశారు. ఈ మధ్యనే మళ్లీ స్టార్ట్ చేశారు.
చెస్ విషయానికి వస్తే.. కరోనా తర్వాత నిర్వహించిన తొలి టోర్నీలో తెలుగు తేజం పెంటేల హరిక్రష్ణ తన సత్తా చాటారు. ప్రతిష్టాత్మక బియల్ చెస్ టోర్నీలో విజయం సాధించారు. ఏడు రౌండ్లకు ఇప్పటికే 5.5 పాయింట్లు సాధించిన తెలుగోడు.. టైటిల్ ను సొంతం చేసుకున్నట్లే. కరోనా తర్వాత నిర్వహించిన ఈ టోర్నీలో తిరుగులేని రీతిలో తన సత్తా చాటారు.
బియల్ చెస్ ఫేవరెట్ గా దిగిన భారత గ్రాండ్ మాస్టర్ తనప్రత్యర్థుల్ని సులువుగా ఢీ కొన్నారు. టోర్నీ నేపథ్యంలో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా వేళ నిర్వహించిన ఈ టోర్నీలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు.. క్రీడాకారుల మధ్య దూరాన్ని పెంచేస్తూ టేబుల్స్ ను వేశారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ప్రతి గేమ్ తర్వాత క్రీడా ప్రాంగణాన్నిప్రత్యేకంగా శానిటైజ్ చేశారు.