Begin typing your search above and press return to search.
భారీ ధర పలికిన పెంట్ హౌస్.. దేశంలో సరికొత్త రికార్డు..!
By: Tupaki Desk | 13 Feb 2023 10:14 AM GMTకరోనా తర్వాత ప్రతి ఒక్కరికి సొంతింటి అవసరం తెలిసి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు సొంతింటి కలను వాయిదా వేస్తూ వస్తున్న వారంతా వాటిపై దృష్టి సారిస్తున్నారు. పేద.. మధ్యతరగతి.. ధనిక ప్రజలంతా తమ స్తోమతకు తగినట్లుగా తమకంటూ ఓ కుటీరం ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కాలంలో పూర్తిగా స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం జెట్ స్పీడుతో దూసుకెళుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్ వచ్చింది. మన దేశంలోనూ ప్రస్తుతం రియల్ రంగం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా మారింది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారంతా ప్రస్తుతం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇకపోతే దేశంలోనే అత్యంత ఖరీదైన ధరకు ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ అమ్ముడు పోయి సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీని ధర తెలుసుకొని ప్రతి ఒక్కరు బాపురే ఇంత రేటా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ ఆర్థిక రాజధానిగా ముంబాయిగా పేరుగాంచింది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఏ ప్రాంతం ఇల్లు తీసుకొని కోట్లు కుమ్మరించాల్సిందే. ఇక అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు కొనాలంటే మాత్రం వందల కోట్లు పెట్టాల్సిందే అన్నట్లుగా ముంబైలో పరిస్థితి తయారైంది. ఓ అపార్ట్మెంట్ లోని పెంట్ హౌస్ ను ఓ ప్రముఖ సంస్థ 230 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ పెంట్ హౌస్ ప్రత్యేకత ఏంటి? అనే చర్చ తాజాగా జరుగుతోంది.
ముంబైలోని వర్లీ ప్రాంతంలో డాక్టర్ అనిబిసెంట్ రోడ్ లో ఒబెరాయ్ రియల్ సంస్థ.. సహానా గ్రూప్ అనే మరో రియల్ ఎస్టేట్ సంస్థతో సంయుక్తంగా 360 వెస్ట్ అనే పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా టవర్ బీలో 63వ అంతస్థులో 29వేల885 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ లగ్జరీ పెంట్ హౌస్ ను నిర్మించింది. అన్ని సౌకర్యాలు.. సదుపాయాలు ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ పెంట్ హౌస్ ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బికె గోయెంకా 230.55 కోట్లకు కొనుగోలు చేశారు.
కాగా కొద్ది రోజుల క్రితం ఇదే అపార్ట్మెంట్లో డీమార్ట్ సంస్థ అధినేత రాధాకిషన్ దమానీ కుటుంబం కోసం రూ.1238 కోట్లతో ఏకంగా 28 ఫ్లాట్లను కొనుగోలు చేయడం విశేషం. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం.. బీచ్ వ్యూ వంటి కారణాలతో ఇక్కడ నిర్మించిన అపార్ట్మెంట్స్ అత్యంత భారీ ధర పలుకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు భారత్ లో సింగిల్ అపార్ట్ మెంట్ కొనుగోలులో అత్యంత ఖరీదైన డీల్ మాత్రం 230.55 కోట్లేనని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.