Begin typing your search above and press return to search.

ఠంచనుగా పింఛన్..ఆదివారమైనా ఉదయం 6 నుంచే పంపిణీ

By:  Tupaki Desk   |   1 March 2020 6:21 AM GMT
ఠంచనుగా పింఛన్..ఆదివారమైనా ఉదయం 6 నుంచే పంపిణీ
X
ఏపీలో జగన్ ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ల వ్యవహారం దేశవ్యాప్తంగా పలువురిని ఆకట్టుకుంటోంది. ఉచిత పథకాలు - సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం అనేక రాష్ట్రాల్లో లబ్ధిదారులు కాళ్లరిగేలా తిరుగుతుంటారు. కానీ, ఏపీలో జగన్ పాలన మొదలయ్యాక పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి పింఛన్లు పొందుతున్న వృద్ధులు - వికలాంగులు - వితంతువులకు ఇంటివద్దకే పింఛన్లు తెచ్చిస్తున్నారు. అది కూడా నెలలో మొదటి తేదీనే అందజేస్తున్నారు. ఈ రోజు మార్చి 1వ తేదీ కావడంతో వలంటీర్లు ఉదయం నుంచే లబ్ధిదారుల ఇల్లకు వెళ్లి పింఛన్లు అందించడం ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్‌ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు. ఉదయం 7 గంటలకే 11శాతంపైగా మందికి పింఛన్‌ పంపిణీ పూర్తిచేసినట్లు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది ట్వీట్ చేశారు.

పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు 26,20,673 మందికి.. 9 గంటలకు 31లక్షల మందికి పింఛన్‌ పంపిణీ పూర్తయింది.