Begin typing your search above and press return to search.
ఆ కంపెనీ షేర్ సుడి తిరిగినట్లేనా?ఉన్నోళ్లందరికి సంక్రాంతి పండుగేనా?
By: Tupaki Desk | 16 Jan 2023 2:30 AM GMTఅప్పటివరకు అప్రాధాన్యతతో ఉండిపోయే షేర్లు కొన్నింటి విషయం వేరుగా ఉంటుంది. వాటి కథ చిన్న పరిణామంతో మార్పులు చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక పెన్నీ షేర్ కథ ఇదని చెప్పాలి. ఇప్పటివరకు నీరసంగా ఉంటూ.. ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు ముందుకు పడటం.. ఆ షేరు గురించి చెప్పినంతనే.. బాబ్బాబు.. ఆ షేరు గురించి చెప్పటానికి మేమే దొరికామా? బతికి ఉంటే బలుసాకు తినొచ్చు.. మాకెందుకు బాబు ఆ షేరు.. అంటూ ఎటకారాలు ఆడేసేవారంతా తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో.. తమ మాటలకు.. తమ ఆలోచనలకు బాధ పడాల్సిన సమయం వచ్చేసింది.
ఇంతకూ ఆ షేరు పేరేంటి? దాని కతేంటి? దానికింత బిల్డప్ ఎందుకు? అన్న సందేహం కలగొచ్చు. అయితే.. విషయం మొత్తం తెలిసిన తర్వాత నిజమే కదా? అన్న భావన కలగటం ఖాయం. ఇంతకూ ఆ షేరు చెప్పలేదు కదా? దాని పేరు.. ఆంధ్రా సిమెంట్స్. షేర్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వారందరి నోట.. ఈ షేరు పేరు గురించి విన్నంతనే బండ షేర్ అనేస్తుంటారు. 2021 ఆగస్టు వేళలో రూ.36 ఉన్న ఈ షేరు తర్వాత రోజుల్లో నేల చూపులు చూడటమే తప్పించి.. పైకి చూసింది లేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆ షేరు ధర దారుణంగా పడిపోయింది.
జారుకుంటూ వచ్చిన ఆ షేరు ధర 2022 జులై నాటికి రూ.6 వరకు పడిపోయింది. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందన్న మాటకు తగ్గట్లే.. ఇప్పుడు ఈ షేరు చేతిలో ఉన్న వారికి తమదైన రోజు వచ్చేసినట్లేనని చెబుతున్నారు. దివాలా ప్రక్రియలో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ ను దివాలా ప్రక్రియ పరిష్కార ప్రక్రియలో భాగంగా సాగర్ సిమెంట్స్ వారు ఈ కంపెనీని తమ చేతికి చిక్కించుకున్నట్లుగా ప్రకటించింది. తమను విజేత బిడ్డర్ గా ప్రకటిస్తూ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్ దివాలా పరిష్కార నిపుణుడి నుంచి సమాచారం అందుకున్నట్లుగా స్టాక్ ఎక్స్సేంజీలకు సాగర్ సిమెంట్స్ సమాచారాన్ని అందించింది.
ఆంధ్రా సిమెంట్స్ కొనుగోలు విషయంలో సాగర్ సిమెంట్స్ తో పాటు పలు పేరున్న కంపెనీలు కూడా ప్రయత్నించాయి. అందులో సాగర్ సిమెంట్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆంధ్రా సిమెంట్స్.. సాగర సిమెంట్స్ రెండూ కూడా హైదరాబాద్కు చెందిన లిస్టెడ్ కంపెనీలే కావటం గమనార్హం. ఆంధ్రా సిమెంట్స్ కు గుంటూరు జిల్లాలోని దాచేపల్లితో పాటు విశాఖలో మొత్తం 26 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయి. సాగర్ సిమెంట్స్ విషయానికి వస్తే.. గత ఏడాది మార్చి నాటికి 825 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.
తాజా డీల్ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కోటి టన్నుల ఉత్పత్తికి చేరుకోవాలన్న లక్ష్యానికి తాజా డీల్ సాయంగా మారుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆంధ్రా సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియ కావటంతో.. దివాలా పరిష్కారం పంచాయితీ ఒక కొలిక్కి వచ్చేయటంతో ఈ షేరు ధరకు మంచి రోజులు వచ్చినట్లేనన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇంతకాలం బండ షేరు అంటూ తల పట్టుకున్న వారి తల తిరిగిపోయేలా ఈ షేరు ధరలో మార్పు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.